రిజర్వాయర్‌లో మరదళ్లతో సెల్ఫీ : ఊపిరితీసిన ఫీట్ (వీడియో)

జనగామ : సెల్ఫీ పిచ్చి మరో ముగ్గురి ఊపిరి తీసింది. సెల్ఫీ కోసం కొత్తగా ట్రై చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. కదులుతున్న ట్రైన్‌తో .. బిల్డింగ్‌పై నుంచి .. నదీలలో సెల్ఫీ తీసుకుంటూ తిరిగిరానిలోకాలకు వెళ్లిన ఘటనలు చూశాం. తాజాగా జనగామ జిల్లాలో కూడా సెల్ఫీ ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అవినాష్ భార్య భార్గవి గుండెలవిసేలా రోదిస్తోంది. ఆమెను ఆపడం ఎవరి తరం కావడం లేదు. ఓ వైపు భర్త .. మరోవైపు చెల్లెళ్ల మృతితో భార్గవి కన్నీటి పర్యంతమైంది.

ప్రాణం తీసిన సరదా ..
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం జీవీ తండాకు చెందిన అవినాష్, భార్గవి దంపతులు. వీరిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. భార్గవి ఇద్దరు చెల్లెలు సంగీత, సుమ ఉన్నారు. వారితోనూ అవినాష్ చనువుగా ఉంటారు. వీరంతా కలిసి సరదాగా పిక్నిక్ అని బొమ్మకూరు రిజర్వాయర్ కు వెళ్లారు. అక్కడ సెల్ఫీ తీసుకుందామనే వీరి ఆలోచనే తిరిగిరాని లోకాలకు వెళ్లేలా చేసింది. రిజర్వాయర్‌లో సెల్ఫీ కోసం ట్రై చేసి ఆసువులు బాసిన ఘటన తండాలో విషాదం నింపింది.

in reservoir take slefi to die


సెల్ఫీ కోసం వెళితే ...
రిజర్వాయర్‌లో మరదళ్లతో బావ సరసం నడిచింది. వీరి చిలిపి పనులను అవినాష్ భార్య భార్గవి కెమెరాలో బంధించింది. మరదళ్ల బావను లేపేందకు ప్రయత్నించారు. ముగ్గురు కలిసి సెల్ఫీ కోసం ట్రై చేశారు. అంతే అక్కడ ఊబి ఉందో తెలియదు కానీ ... బావ మునిగిపోయాడు. ఆ మరదళ్లు బావ .. బావ అని ఆర్తనాదాలు చేశారు. తన కళ్ల ముందే భర్త మునిగిపోయాడనే విషయాన్ని భార్య జీర్ణించుకోలేకపోయింది. బావ కోసం చూసి .. మరదళ్లు కూడా రిజర్వాయర్‌లో మునిగిపోయారు.

దీంతో హతాశులైన భార్గవి .. స్థానికులకు సమాచారం అందించడంతో కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే అవినాశ్ చనిపోయాడు. అతని మృతదేహన్ని వెలికితీశారు. మరదళ్లు సంగీత, సుమ కోసం గాలింపు కొనసాగుతోంది. ఒకే ఇంటిలో ముగ్గురు చనిపోవడంతో .. విషాద వదనం నెలకొంది. అవినాష్ భార్య గుండెలవిసేలా రోదిస్తోంది. స్థానికులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+