ఉరేసుకున్న విద్యార్థి, కొడుకును కొట్టిన తండ్రి అరెస్టు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మాదాపూర్‌లో గల ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సుమిత్ అనే విద్యార్థి హాస్టల్ గదిలోని బాత్రూంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సుమిత్ స్వస్థలం రాజమండ్రి.
విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. కళాశాల యాజమాన్యం పోలీసులకు, మృతుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
ఇదిలావుంటే, హైదరాబాదులోని మైలార్‌దేవ్ పల్లిలో కుమారుడిని కొట్టిన ఓ తండ్రిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ బాబుల్ రెడ్డి నగర్ బస్తీకి చెదిన సురేందర్ (32), సుజాత దంపతులకు భార్గవ్ (11)ను తీవ్రంగా కొట్టాడు. దీంతో బార్గవ్ పన్ను విరిగింది.

భార్గవ్ తన తల్లి సాయంతో బుధవారంనాడు తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సురేందర్‌పై కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.
చిత్తుగా మద్యం తాగి ఆపై ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా మధిర మండలం చిలుకూరు గ్రామానికి చెందిన పాముల రామకోటయ్య విపరీతంగా మద్యం తాగి కత్తితో వెంకయ్య(50)ను పొడిచి చంపాడు. పోలీసులు నిందితుడిని పట్టుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications