తెలంగాణ పోలీస్‌ను పొడిచి, పారిపోయే యత్నం..: ఐసిస్ భారత్ చీఫ్ అరెస్ట్

న్యూఢిల్లీ/బెంగళూరు: ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) భారత్ చీఫ్‌ను అరెస్టు చేశారు. అతను మన దేశంలో సాయుధ కార్యకర్తలను నియమిస్తున్నట్లు వెల్లడైంది. అతనిని ఎన్ఐఏ, పోలీసులు బెంగళూరులో దాడి చేసి పట్టుకున్నారు. అతను ఓ కానిస్టేబుల్‌ను కత్తితో పొడిచి పారిపోయేందుకు ప్రయత్నించాడు.

వెంటనే చుట్టుముట్టిన పోలీసు బృందాలు అతనిని అదుపులోకి తీసుకున్నాయి. తెలంగాణ పోలీసుల నిఘాతో ఐసిస్ చీఫ్ గుట్టు రట్టయింది. అతను హైదరాబాద్ పేలుళ్ల కేసులోను నిందితుడిగా గుర్తించారు. అతని పేరు రఫిక్ అహ్మద్. ఇప్పుడు అతని ఆట కట్టయింది.

బెంగళూరులో ఉగ్రవాది నివసిస్తున్న ఇంటిపై ఎన్‌ఐఏతో పాటు నాలుగు రాష్ట్రాల పోలీసులు కలిసి దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్‌, అహ్మదాబాద్‌ పేలుళ్ల ఘటనల్లో రఫిక్ కీలక నిందితుడిగా గుర్తించారు.

ISIS 'chief recruiter' held

2013లో దిల్‌సుఖ్ నగర్‌ వద్ద జంటపేలుళ్ల విధ్వంసంతోనూ ఇతడికి సంబంధం ఉందన్న సమాచారం అందింది. శనివారం రాత్రి తొమ్మిదింటికి ప్రారంభమైన పోలీసుల దాడుల పరంపర ఉత్కంఠభరితంగా కొనసాగింది. బెంగళూరులోనే ప్రస్తుతం రహస్య జీవితాన్ని గడుపుతున్నాడు.

పరప్పన అగ్రహార ప్రాంతంలో ఓ గదికి నెలకు రూ.3,200 అద్దె చెల్లిస్తున్నాడు. ఏసీ మెకానిక్‌నని అక్కడి వారిని నమ్మించాడు. సమాచారం మేరకు.. రాత్రి భోజన సమయంలో సాయుధ పోలీసు బలగాలు అతడి గదిని ఏకకాలంలో చుట్టుముట్టాయి.

ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రధాన ద్వారం వద్ద కదిలిన హైదరాబాద్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసులును రఫిక్‌ గమనించి ఎదుర్కొనేందుకు ప్రయత్నించాడు. కత్తితో పొడిచి పారిపోయేందుకు అడుగు వేసేంతలోపే సమీపంలో ఉన్న పోలీసు బృందాలు ఒక్కసారిగా దాడి చేసి అదుపులోకి తీసుకున్నాయి. కానిస్టేబుల్‌ శ్రీనివాసులుకు గాయాలయ్యాయి. ఆ ఇంట్లో ఉన్న మహిళనూ విచారిస్తున్నారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+