ఐటీగ్రిడ్ అశోక్‌కు బెయిల్ .. కానీ ...
హైదరాబాద్ : ఐటీగ్రిడ్ డైరెక్టర్ అశోక్ హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ఆధార్, డేటా చోరీ కేసుల్లో షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వీటికి సంబంధించి ఆధార్ సంస్థ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కానీ అతను దేశం విడిచి వెళ్లొద్దని, పాస్‌పోర్టు అప్పగించాలని తదితర కండీషన్లు విధించింది హైకోర్టు.
డేటా చోరీ ..
ఏపీ ప్రజలకు సంబంధించి ఆధార్, డేటా చోరీ చేశాడని ఐటీగ్రిడ్ డైరెక్టర్ అశోక్‌పై ఆధార్ సంస్థ ఫిర్యాదు చేసింది. దీంతో అశోక్ చేస్తున్న డేటా చోరీ అంశం సార్వత్రిక ఎన్నికల వేళ సంచలనం సృష్టించింది. ఆధార్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ ఫిర్యాదు చేయడంతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్షన్ 37, 38-ఏ, 38-బీ, 38-జీ, 40, 42, 44-ఏఏల కింద ఐటీగ్రిడ్స్ సంస్థపై కేసులు పెట్టారు.

డైరెక్టర్ అశోక్ కోసం దర్యాప్తు బృందాలు గాలించాయి. ఆ సమయంలో ముందస్తు బెయిల్ కోసం కూడా అశోక్ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో ఆయన అజ్ఞాతంలోనే ఉండిపోయారు. ఎన్నికలు ముగిసి .. కేసు మళ్లీ తిరగదోడే సమయంలో హైకోర్టును ఆశ్రయించారు అశోక్.
ముందస్తు బెయిల్ ...
ఆధార్, డేటా చోరీ అంశంపై నమోదైన కేసుల నుంచి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు అశోక్. పిటిషినర్ తరఫు వాదనుల విన్న హైకోర్టు .. బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించింది. కానీ కొన్ని కఠినమైన షరతులు విధించింది. అకోశ్ విదేశాలకు వెళ్లకూడదని స్పష్టంచేసింది. పాస్‌పోస్టును కోర్టును అప్పగించాలని షరతు విధించింది. అలాగే కేసు విచారణకు సంబంధించి ప్రతిరోజు విధిగా పోలీసుస్టేషన్‌కు హాజరుకావాలని కండీషన్ పెట్టింది. తాము పెట్టిన షరతులకు అంగీకరిస్తే .. ముందస్తు బెయిల్ ఇస్తామని స్పష్టంచేసింది. ఇందుకు అశోక్ తరఫు న్యాయవాది అంగీకరించినట్టు తెలిసింది.












Click it and Unblock the Notifications