చూస్తుండండి..! అదే సీన్ రిపీటవుద్ది : కాంగ్రెస్ భవిష్యత్ పై జానారెడ్డి
తెలంగాణలో పోటీ ఏదైనా.. ఫలితం ఏకపక్షమేనన్న తరహాలో దూసుకుపోతుంది అధికార టీఆర్ఎస్ పార్టీ. తాజా పాలేరు ఉపఎన్నికలోను అదే ఫలితం రిపీటయ్యింది. ఖంగు తిన్న కాంగ్రెస్ ఎప్పటిలాగే ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో పడింది. కాగా.. కాంగ్రెస్ ఓటమిపై స్పందించిన సీఎల్పీ నేత జానారెడ్డి మాత్రం కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడంపై ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రజలు తాము విశ్వసించిన నాయకులకే పట్టం కడుతారని చెప్పిన జానారెడ్డి.. గతంలోకి వెళ్తే, అసోంలో 5 సీట్లు కూడా లేని బీజెపి ప్రస్తుతం అక్కడ అధికారం చేపట్టిందని, అదే తరహాలో రానున్న రోజుల్లో తెలంగాణలోను కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. తమ ఓటమికి కారణాలను పార్టీ సమావేశంలో విశ్లేషించుకుంటామన్నారు.
పాలేరు ఉపఎన్నిక కోసం పార్టీ నాయకత్వమంతా సమిష్టి కర్తవ్యాన్ని నిర్వర్తించామని, ఇకముందు కూడా ఇలాగే పనిచేస్తామని తెలిపారు. రాజకీయాల్లో గెలుపోటములు ఎప్పుడూ ఉండేవే అన్నట్టుగా మాట్లాడిన ఆయన, కర్తవ్య నిర్వహణ ముఖ్యమని తెలియజేశారు. ఇక పాలేరు ఉప ఎన్నికలో విజయం సాధించిన టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావుకు జానారెడ్డి అభినందనలు తెలిపారు.












Click it and Unblock the Notifications