తేనెతుట్టెను కదిపి వెళ్ళిన కడియం కావ్య.. కేసీఆర్ కు నయా పరేషాన్!!
వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి అభ్యర్థిగా కెసిఆర్ ప్రకటించిన కడియం కావ్య తాను పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి, తండ్రి కడియం శ్రీహరి తో కలిసి కాంగ్రెస్ బాట పట్టడంతో ఒక వరంగల్ జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా బి ఆర్ ఎస్ శ్రేణులలో ఆందోళన వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులలో టెన్షన్ చోటు చేసుకుంది.
కడియం కావ్య పార్టీని వీడి వెళ్ళిపోయిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఎంపీ అభ్యర్థుల పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వారు కూడా ఈసారి పోటీ చేస్తే గెలుపు కష్టమేనేమో అన్న సందిగ్ధంలో పడుతున్నారు. బీఆర్ఎస్ లో ఉండాలా.. పోవాలా.. ఒకవేళ ఉన్నా పోటీ నుండి తప్పుకుంటే మంచిదా అన్న ఆలోచన చేస్తున్నారు.

ఇప్పటికి కడియం కావ్య బాటలో పార్టీని వీడి వెళ్లేందుకు మరి కొంతమంది అభ్యర్థులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత పార్టీని విడిచి పెడతారని, పోటీ నుంచి తప్పుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే అది రూమర్ మాత్రమేనని తన పోటీలో ఉంటానని మాలోతు కవిత చెబుతున్నప్పటికీ ఎప్పుడు ఎవరి మనసు ఏ విధంగా మారుతుందో అర్థం కాక అధినాయకత్వం కూడా ఆందోళనలో ఉంది.
ఇక మరోవైపు కేసీఆర్ అభ్యర్థులుగా ప్రకటించిన వారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో, అనేక కేసుల్లో అధినేత కుటుంబం ఇరుక్కుంటున్న క్రమంలో భవిష్యత్ పై ఆందోళనలో ఉన్నారు. పోటీ చేస్తే గెలుస్తామా లేదా అన్న అనుమానంలో ఉన్నారు. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందేమో అన్న డైలమాలో ఉన్న నాయకులు, ఇంతకుమించి బెటర్ ఆపర్చునిటీ వస్తే జంప్ అవుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కొద్ది రోజులు ప్రచారం చేసుకొని మరీ నేను అభ్యర్థిగా ఉండలేను అని కడియం కావ్య కేసీఆర్ కు లేఖ రాసి వెళ్లిపోవడంతో ఇటు అభ్యర్థులు డి మోరల్ అవుతున్నారు. మరోవైపు అధినాయకత్వం కూడా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రత్యామ్నాయం కోసం వేట మొదలు పెట్టింది.












Click it and Unblock the Notifications