ఎర్రబెల్లి పిచ్చిగా, మందకృష్ణ రోజుకో మాటా పూటకో మాట: కడియం
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తీవ్రంగా విరుచుకుపడ్డారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
ఎర్రబెల్లి దయాకర్‌రావు తన భాష తీరును మార్చుకోవాలన్నారు. తనకు మంత్రి పదవిని ఇప్పించానని అంటున్న ఎర్రబెల్లి మాటలను చూసి నవ్వుకోవాల్సి వస్తోందని ఆయన అన్నారు. మంద కృష్ణ మాదిగ రోజుకో మాట, పూటకో పార్టీతో ఉంటారన్నారు. మంద కృష్ణ వ్యవహరశైలితో మాదిగలంతా ఎమ్మార్పీఎస్‌కు దూరమవుతున్న విషయాన్ని ఆయన గుర్తించాలన్నారు.

పాలకూర్తిలో ఎర్రబెల్లి ఉద్దేశ్యపూర్వకంగా గొడవకు దిగుతున్నాడని తెలిపారు. పాలకూర్తికి రూ.25కోట్ల నిధులు ఆపానంటూ తనపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. పాలకూర్తిలో తన కారు అద్దాలను ధ్వంసం చేస్తామని ప్రకటిస్తున్నాడని, తాటాకు చప్పుళ్లకు భయపడబోమని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆశీర్వాదం వల్ల నేను డిప్యూటీ సీఎం అయ్యానని చెప్పుకున్నారు
తాము డిప్యూటీ సిఎం అయిన విషయాన్ని జీర్ణించుకోలేక ఎర్రబెల్లి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. మందకృష్ణ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. దళిత నాయకులను బ్లాక్‌మెయిల్ చేయడం మందకృష్ణకు అలవాటేని ఎద్దేవా చేశారు.
టీఆర్‌ఎస్ వర్గీకరణకు కట్టుబడి అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం గుర్తు చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మందకృష్ణ పోరాటం చేయాలని ఆయన సూచించారు. వరంగల్ లోకసభ స్థానంలో తన కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయబోరని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications