కేసీఆర్ ఫోటో అవసరం లేదు.. తెలంగాణలో యాత్రకు సిద్దమైన కవిత !
తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా "యాత్ర" చేపట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ యాత్రను అక్టోబర్ చివరి వారంలో ప్రారంభించనున్నట్లు సమాచారం. అందులో భాగంగా ప్రతి జిల్లాలో ప్రజలతో ప్రత్యక్షంగా కలవడం, వారి సమస్యలు తెలుసుకోవడం.. తెలంగాణ ఆత్మను మరోసారి గుర్తు చేస్తామని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కేసీఆర్ ఫోటో లేకుండానే..
అయితే ఈ యాత్రలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆమె తండ్రి కేసీఆర్ ఫోటో లేకుండా యాత్రను నిర్వహించనున్నారు. దాని స్థానంలో తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోను పోస్టర్లలో ఉపయోగించనున్నట్టు తెలిపారు. ఈ యాత్ర తెలంగాణ స్వరాన్ని వినిపించాలనే ధ్యేయంతో చేపట్టనున్నట్టు చెప్పుకొచ్చారు. అందులో రాజకీయాలకు స్థానం లేదని చెప్పినట్టు సమాచారం. కానీ ఈ నిర్ణయం కవిత స్వతంత్ర రాజకీయ ధోరణిని.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

యాత్ర ప్రణాళిక..
కవిత యాత్రకు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను రేపు (బుధవారం) విడుదల చేయనున్నారు. జాగృతి కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ పోస్టర్ డిజైన్ పూర్తిగా ప్రొఫెసర్ జయశంకర్ ప్రతిభా చిత్రంతో, తెలంగాణ మట్టివాసనతో రూపొందించనున్నట్టు చెబుతున్నారు. పోస్టర్ విడుదల అనంతరం యాత్ర షెడ్యూల్, మార్గం, ప్రారంభ స్థలం, సమావేశాల తేదీలను కూడా వెల్లడించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల మీదుగా ఈ యాత్ర కొనసాగనుంది. యాత్రలో భాగంగా పల్లెలు, పట్టణాలు, విద్యాసంస్థలు, సాంస్కృతిక కేంద్రాలను కవిత సందర్శించనున్నారు. ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాలు, విద్యార్థి సమాఖ్యలు, సామాజిక సంస్థలతో ఆమె సమావేశాలు నిర్వహించనున్నారు. అలానే తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకున్న మార్పులు, సాధించిన విజయాలు, ఇంకా చేయాల్సిన పనులపై ఈ యాత్రలో చర్చ జరగనున్నట్టు భావిస్తున్నారు. ఇక ఇటీవల పలు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలతో కవిత సమావేశమయ్యారు. వారి సూచనలు తీసుకుంటూ, తెలంగాణ భవిష్యత్తు, బీసీ అభివృద్ధి, మహిళా సాధికారత వంటి అంశాలపై చర్చించారు.
కవిత యాత్ర రాజకీయపరంగా కీలక మలుపు కావొచ్చని విశ్లేషకుల అభిప్రాయం. అలానే బీఆర్‌ఎస్ భవిష్యత్తు కార్యాచరణల్లో కూడా ఈ యాత్ర ప్రభావితం చూపవచ్చని అనుకుంటున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ స్పూర్తితో ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర.. తెలంగాణ భవిష్యత్తుపై కొత్త చర్చలకు దారితీయడం ఖాయమని చర్చ జరుగుతోంది.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications