సెక్షన్ 8పై బాబు ఒత్తిడి చేసినా బీజేపీ నో: కర్నె, బంద్‌కు పిలుపివ్వండి: కేసీఆర్‌కు సూచన
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి సెక్షన్ తెచ్చే ప్రయత్నాలు తెస్తున్నారని, అయినప్పటికీ తమకు కేంద్రం పైన విశ్వాసం ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి నేత కర్నె ప్రభాకర్ మంగళవారం అన్నారు. సెక్షన్ 8ను కేంద్రం అమలు చేయదని భావిస్తున్నామన్నారు.
సెక్షన్-8 అవసరం లేదు: పేర్వారం
సెక్షన్-8 అవసరం లేదని మాజీ డీజీపీ పేర్వారం రాములు తేల్చి చెప్పారు. కేసీఆర్ తెలంగాణ రాగానే లా అండ్ ఆర్డర్‌కే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉందని, నేరం వేరు, లా అండ్ ఆర్డర్ వేరన్నారు. సెక్షన్-8 ఫెడరల్ స్పూర్తికి విరుద్ధమని అరుణ్ జైట్లీ రాజ్యసభలోనే చెప్పారన్నారు.

బంద్‌కు పిలుపివ్వండి: కేసీఆర్‌కు టీఎన్జీవోలు
సెక్షన్ 8 అమలు ప్రయత్నాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వాలని తాము ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కోరినట్లు టీఎన్జీవో సంఘం నేతలు చెప్పారు. మంగళవారం టీఎన్జీవోలు అత్యవసరంగా భేటీ అయ్యారు.
బందుకు పిలుపునివ్వాలని కేసీఆర్‌ను కోరామని వారు చెప్పారు. సెక్షన్ 8 పైన ఉద్యోగ సంఘాల నేతృత్వంలో ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. రేపు మధ్యాహ్నం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు.
ఆంధ్ర వ్యక్తిపై దాడి జరగలేదు: జీవన్ రెడ్డి
సెక్షన్ 8 అమలు అవసరం లేదని జీవన్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో ఒక్క ఆంధ్ర వ్యక్తి పైన దాడి జరగలేదని చెప్పారు. హైదరాబాదు పైన పెత్తనం కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మెతక వైఖరి వల్ల ఓటుకు నోటు కేసు నీరుగారుతోందన్నారు. హైదరాబాదులో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులను ఏపీలో ఫైల్ చేస్తే అవి చెల్లవన్నారు.
జగన్ నాటకానికి స్వస్తీ పలకాలి: శిద్దా
కేసీఆర్‌తో ఆడుతున్న నాటకానికి వైయస్ జగన్ స్వస్తీ పలకాలని మంత్రి శిద్దా రాఘవ రావు అన్నారు. సెక్షన్ 8 అమలు చేయాల్సిందేనని చెప్పారు. హైదరాబాదులో ఒకరి పైన ఆధారపడి బతకాల్సిన అవసరం తమకు లేదని చినరాజప్ప అన్నారు.












Click it and Unblock the Notifications