యాదాద్రి దాకా ఎంఎంటిఎస్ రైలు: సురేష్ ప్రభుకు కెసిఆర్ లేఖ
హైదరాబాద్: యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రైళ్లను నడపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కేంద్ర రైల్వే మంత్రి సురేశ్‌ప్రభుకు విజ్ఞప్తి చేశారు. ఎంఎంటీఎస్ లైన్‌ను ఘట్‌కేసర్ నుంచి రాయగిరి వరకు పొడిగించి రైళ్లను నడిపించాలని శుక్రవారం కేంద్రమంత్రికి రాసిన లేఖలో కోరారు.
ఈ పనులకయ్యే వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం మూడింట రెండొంతుల భాగాన్ని భరిస్తుందని, మిగిలిన మొత్తాన్ని రైల్వే శాఖ భరించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. ఈ మేరకు 2016-17 రైల్వే బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని కోరారు.
హైదరాబాద్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే రైళ్లు అందుబాటులో ఉన్నాయని, దీనివల్ల రోడ్డు మార్గంలోనే అత్యధిక ప్రయాణికులు వెళ్తున్నారని కేసీఆర్ వివరించారు.
ఘట్‌కేసర్ నుంచి రాయగిరి వరకు 32 కిలోమీటర్ల మేరకు ఎంఎంటీస్ సర్వీసులను పొడిగించాల్సిన క్రమంలో సుమారు రూ. 330 కోట్ల వ్యయమవుతుందని అంచనా ఉందని చెప్పారు. హైదరాబాద్‌కు కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు, ఆ ప్రాంతాన్ని పవిత్ర పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని లేఖలో చెప్పారు.

సికింద్రాబాద్-కాజీపేట మార్గంలో రాయగిరి వద్ద హాల్ట్ స్టేషన్ ఉన్న అంశాన్ని ప్రస్తావిస్తూ - ఎంఎంటీఎస్ సర్వీసులను యాదాద్రి దాకా పొడిగించేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎంఎంటీస్ రెండో దశ నిర్మాణం కూడా జరుగుతోందని, ఇదే నిర్మాణాన్ని ఘట్‌కేసర్ నుంచి రాయగిరి వరకు పొడిగించవచ్చని, ఇందుకుగాను మూడో లైనును వేయాల్సి ఉంటుందన్నారు. రాయగిరిని యాదాద్రి స్టేషనగా పేరు మార్చాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
యాదాద్రి టెండర్లకు క్యూ
యాదాద్రి అభివృద్ధ్ది పనులు నిర్వహించేందుకు వైటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఈ ప్రొక్యూర్‌మెంటు టెండర్లలో బహుళజాతి కంపెనీలు ఎల్‌అండ్‌టీ, టాటా, ఎన్‌సీసీ, హిందుస్తాన్ కన్‌స్టక్షన్స్, రాంకీ, సన్‌షైన్ ఇంజినీర్స్ ఇన్‌ఫాస్ట్రక్చర్స్ అర్హత సాధించాయి.
అభివృద్ధ్ది పనుల్లో మొదట ఆలయ దక్షిణభాగం నుంచి కాంపౌండ్‌వాల్ నిర్మాణం చేసేందుకు టెండర్లు పిలుస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సెక్రెటరీ రాజీవ్‌శర్మ శనివారం యాదాద్రిలో అధికారులతో సమావేశమవుతున్నారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications