పట్టిసీమకు అనుమతుల్లేవు, ఎపి యాగీ: గవర్నర్‌కు కెసిఆర్ ఫిర్యాదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి విషయంపై అనవసరమైన యాగీ చేస్తోందని, తమ ప్రభుత్వం తప్పు చేయనప్పటికీ కావాలని బురదజల్లే ప్రయ త్నం చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. గవర్నర్‌ను ఆయన మంగళవారం సాయంత్రం కలిశారు.
పాలమూరు ఎత్తిపోతల పథకంపై ఏపీ దుష్ప్రచారం చేస్తోందని, ఇది పాత ప్రాజెక్టు అని, ఉమ్మడి ఏపీలోనే అన్ని అనుమతు0లు వచ్చాయనిస అయినప్పటికీ దీనిపై ఏపీ అభ్యంతరా లు చెబుతోందని కెసిఆర్ ఆయనకు చెప్పారని అంటున్నారు. ఏపీలో ఎలాంటి అనుమతులు లేకుండానే పట్టిసీమ ప్రాజెక్టును నిర్మిస్తోందని, లోగడ ఉమ్మడి రాష్ట్రంలో ఇలాగే రాయలసీమలో అనుమతుల్లేని ప్రాజెక్టులు చాలా నిర్మించారని ఫిర్యాదు చేశారు.
దీనిపై కేంద్రం ప్రశ్నిస్తే, ఆయా ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టామని, కట్టిన ప్రాజెక్టులను కూలగొట్టలేమని చెబుతూ వచ్చింది. ఇప్పుడు అలాగే పట్టిసీమను నిర్మిస్తోందని, నిధులు వెచ్చించామనే వాదన కూడా భవిష్యత్తులో వినిపిస్తారని కెసిఆర్ గవర్నర్‌కు వివవరించినట్లు సమాచారం.

అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, తెలుగు యూనివర్సిటీల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కెసిఆర్ గవర్నర్ వద్ద పూర్తిగా సమర్థించుకున్నట్లు తెలుస్తోంది. ఉస్మానియా ఆస్పత్రి భవనం కూల్చివేత వివాదం కూడా వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. శిథిలావస్థకు చేరిన భవనంలో ఆస్పత్రిని కొ నసాగించలేమని సీఎం కేసీఆర్ గవర్నర్‌కు స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.
రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసుకోవడంలో అక్కడి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తోందని కేసీఆర్ గవర్నర్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయమై తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో ఆందోళన చేసినప్పటికీ, ఏపీ ప్రభుత్వం శీఘ్రగతిన స్పందించే విధంగా కేంద్రం చొరవ చూపడం లేదని ఆయన అన్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications