వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎర్రవెల్లి ఫాంహౌస్లో కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్: యాక్షన్ ప్లాన్ సిద్ధం; కీలక నిర్ణయాలివే!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్లో తెలంగాణ మంత్రులు, అధికారులతో అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రంపై పోరాటానికి సిద్ధమవుతున్న కేసీఆర్ కేంద్రంపై ఒత్తిడి పెంచే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టు సమాచారం

ఉద్యోగార్ధుల వయో పరిమితి సడలింపుపై కేసీఆర్ వద్దకు ప్రతిపాదనలు; నిరీక్షిస్తున్న నిరుద్యోగులుఉద్యోగార్ధుల వయో పరిమితి సడలింపుపై కేసీఆర్ వద్దకు ప్రతిపాదనలు; నిరీక్షిస్తున్న నిరుద్యోగులు

21వ తేదీన టీఆర్ఎస్ శాసన సభాపక్ష సమావేశం

21వ తేదీన టీఆర్ఎస్ శాసన సభాపక్ష సమావేశం

ఈనెల 21వ తేదీన సోమవారం నాడు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ లు, డీసీఎంఎస్, డిసిసిబి అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్రంపై ఒత్తిడికి యాక్షన్ ప్లాన్

యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్రంపై ఒత్తిడికి యాక్షన్ ప్లాన్


ఇక ఇదే సమయంలో రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ సమావేశంలో పలు ఆందోళన కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రితో పాటు మంత్రుల బృందం అదే రోజున ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.

 రాష్ట్రంలో ఆందోళనలు, లోక్ సభ, రాజ్యసభలలోనూ ఆందోళనలు

రాష్ట్రంలో ఆందోళనలు, లోక్ సభ, రాజ్యసభలలోనూ ఆందోళనలు


ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రులను అవసరమైతే ప్రధానిని కలిసి తమ డిమాండ్ తెలియజేయాలని భావిస్తున్నారు. తెలంగాణలో జరిగే ఆందోళనా కార్యక్రమాలకు అనుగుణంగా అటు లోక్సభలోనూ ఇటు రాజ్యసభలోనూ టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన వరి ధాన్యాన్ని కేంద్రం 100% సేకరిస్తున్న కారణంగా , తెలంగాణ వరి ధాన్యాన్ని కూడా పంజాబ్ తరహాలో 100% ఎఫ్సీఐ సేకరించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.

 కేంద్రంపై ఉధృతమైన పోరాటానికి రెడీ అవుతున్న కేసీఆర్

కేంద్రంపై ఉధృతమైన పోరాటానికి రెడీ అవుతున్న కేసీఆర్


తెలంగాణ రైతుల జీవన్మరణ సమస్య అయిన వరి ధాన్యం కొనుగోలుపై ఈ దఫా ఉధృతమైన పోరాటాలకు టిఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మంత్రులకు వెంటనే ఎర్రవల్లి లోని వ్యవసాయ క్షేత్రానికి రావాలని ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసిన కెసిఆర్ మీటింగ్ లో ఏం చెప్తారు అన్నదానిపై రాష్ట్రవ్యాప్త ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. మొత్తానికి సీఎం కేసీఆర్ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కాస్త సైలెంట్ గా కనిపించినా మళ్లీ కేంద్రంపై తన దూకుడును కొనసాగించటానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు.

English summary
CM KCR held an emergency meeting with Telangana ministers and officials at his farm house in Erravelli. CM KCR took several key decisions. KCR action plan to pressurise on the center as it prepares to fight for paddy procurement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X