లంచం ఇచ్చినా, తీసుకున్నాచంపేస్తా!: కేసీఆర్, ఫోన్..

వరంగల్: లంచం అడిగితే డొక్క చీలుస్తానని, తనకు ఒక్క ఫోన్ కొడితే అరెస్టు చేయించి జైల్లో తోయిస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం అన్నారు. అందుకోసం ఆయన ఫోన్ నెంబర్ (040-23454071) ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. మహిళలు బిందెలతో బయట కనిపిస్తే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తానని, ఏ సీఎం చేయని పని నేను చేసి చూపించానని కేసీఆర్ అన్నారు.

మురికివాడల్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా లంచం అడిగితే బాగుండదని హెచ్చరించారు. వరంగల్‌లో నాలుగోరోజు పర్యటనలో భాగంగా ఆదివారం ఆరు మురికివాడల్లో పక్కా ఇళ్లకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీపురంలో ప్రజలనుద్దేశించి కేసీఆర్‌ ప్రసంగించారు.

ఇక ఇళ్ల నిర్మాణాలు జరుగుతుంటయని, సందులో మందని పైరవీకార్లు, పుండాకోర్లు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తారని, డబ్బులు గుంజాలని చూస్తారని, అట్లా ఎవరైనా అడిగితే ఇవ్వొద్దని, తనకు ఫోన్‌ చేయాలని, తన టోల్‌ఫ్రీ నెంబర్‌ 040-23454071 అని, అధికారులు మీ పేరు, అడ్రస్‌ రాసుకొని యాక్షన్‌ తీసుకుంటరని, వారిని అరెస్టు చేసి జైల్లో పారేస్తారని, ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదని, లంచమిస్తే మిమ్మల్ని కూడా పొట్టు పొట్టుగా చంపేస్తానని కేసీఆర్ అన్నారు.

కేసీఆర్

కేసీఆర్

సూరత్, సోలాపూర్, తిర్పూర్‌లను తలదనే్నలా వరంగల్‌లో భారీ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని సిఎం చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం వరంగల్‌లోని మాజీమంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.

కేసీఆర్

కేసీఆర్

మహారాష్ట్రలోని సూరత్‌లో ఇప్పటికే ఆరు లక్షల పవర్ లూమ్స్ నడుస్తున్నాయని, తిర్పూర్‌లో జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లులు, సోలాపూర్‌లో చెద్దర్లు, రుమాండ్లు ప్రసిద్ధిగాంచినవని, అయితే మూడింటినీ కలగలిపిన వస్త్ర పరిశ్రమను వరంగల్‌లో ఏర్పాటు చేసి తీరుతామన్నారు.

కేసీఆర్

కేసీఆర్

ఇందుకు అనుగుణంగా ఇక్కడ గొప్ప రైల్వే జంక్షన్ ఉండడంవల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటికే జిల్లాలోని వర్ధన్నపేట, పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్, శాయంపేట ప్రాంతాల నుంచి దాదాపు 4 లక్షలమంది కార్మికులు సూరత్‌కు వలసవెళ్లారని, అయితే వారంతా ఇప్పుడు ఆ పనిలో నైపుణ్యం సాధించడం శుభ పరిణామమని, వారంతా ఇక్కడ టెక్స్‌టైల్ పార్క్ నెలకొల్పగానే తిరిగి వస్తారని తనకు హామీ ఇచ్చారన్నారు.

కేసీఆర్

కేసీఆర్

అక్కడ నుండి తిరి గివచ్చిన కార్మికులందరికి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంతోపాటు సబ్సిడీ రుణాలు అందించి ప్రోత్సహిస్తుందన్నారు. వరంగల్ జనాభా త్వరలోనే 20 లక్షలకు చేరుకుంటుందని, అందుకు అనుగుణంగా భవిష్యత్‌తరాలను దృష్టిలో పెట్టుకుని రోడ్లను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మడికొండ నుంచి వరంగల్ వరకు వడ్డేపల్లి నుంచి వర్సిటీ వరకు 150 ఫీట్ల మేర రోడ్ల వెడల్పు కార్యక్రమం త్వరలో చేపడతామన్నారు.

కేసీఆర్

కేసీఆర్

రోడ్డుకు ఇరువైపుల సైకిల్ వే, ఫుట్‌పాత్‌లు నిర్మించి సుందరనగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. పట్టణాలను అభివృద్ధి చేసేందుకే ఈ శాఖ తన పరిధిలో ఉంచుకున్నానని, త్వరలోనే ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటిస్తానని కెసిఆర్ పేర్కొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ త్వరలో ప్రకటించబోతున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.

కేసీఆర్

కేసీఆర్

దీంతో పాటు గ్రేటర్ వరంగల్ కూడా రూపుదిద్దుకోనుందని సిఎం చెప్పారు. ఫ్లాన్ అవర్ వరంగల్ బ్యానర్ కింద అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. కూరగాయల మార్కెట్, మీట్, ఫిష్ మార్కెట్‌లను ఆధునీకరిస్తామని తెలిపారు. క్రీడా స్థలాల ఏర్పాటుతో పాటు చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా చేపడతామన్నారు.

కేసీఆర్

కేసీఆర్

నాలుగు రోజులుగా తాను వరంగల్ అభివృద్ధిపైనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, అధికారుల బృందంతో చర్చించానని, త్వరలోనే వరంగల్ రూపురేఖలు మార్చబోతున్నానన్నారు. నగరాన్ని ఐటి హబ్‌గా కూడా చేయబోతున్నానని ప్రకటించారు. కాకతీయులు పరిపాలించిన చరిత్ర కలిగిన నగరాన్ని అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఇప్పటికే వరంగల్‌కు ఆరోగ్య యూనివర్సిటీ మంజూరు చేశామని, త్వరలోనే వరంగల్ ఎంజియంను కూడా అభివృద్ధి చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+