వచ్చే నెలలో ముఖ్యమంత్రి కెసిఆర్ చైనా పర్యటన

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సెప్టెంబర్ 8 నుంచి 15 వరకు చైనాలో పర్యటించనున్నారు. చైనాలో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం) సదస్సులో పాల్గొంటారు. వేదిక నిర్వాహకుల ఆహ్వానం మేరకు సిఎం కెసిఆర్ వెళ్తున్నారు.

ముఖ్యమంత్రితో పాటు ఆయన కార్యాలయ ముఖ్యకార్యదర్శులు ఎస్‌ నర్సింగరావు, ఎం శాంతికుమారి, అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌లు చైనాకు వెళతారు.

KCR tour in September to china

చైనాలో పలువురు పారిశ్రామికవేత్తలు, ఆర్థిక, వాణిజ్య నిపుణులతో సిఎం కెసిఆర్ భేటీ అవుతారు. సదస్సు అనంతరం పెట్టుబడుల సమీకరణపై కెసిఆర్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు.

కాగా, చైనా నుంచి సిఎం కెసిఆర్ 16వ తేదీ హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఆ తర్వాత రెండు మూడు రోజుల వ్యవధిలో రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+