యాత్రకు బ్రేక్: నాయినితో భేటీ, కాసేపటికే కోదండరాం అరెస్ట్
అమరుల స్ఫూర్తి యాత్ర కోసం వరంగల్ వెళ్తున్న రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘట్కేసర్ జోడిమెట్ల వద్ద ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని.. కీసర పోలీసుస్టేషన్‌కు తరలించారు.
హైదరాబాద్: అమరుల స్ఫూర్తి యాత్ర కోసం వరంగల్ వెళ్తున్న రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘట్కేసర్ జోడిమెట్ల వద్ద ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని.. కీసర పోలీసుస్టేషన్‌కు తరలించారు.
అంతకుముందే మంత్రి నాయినిని కలిసిన కోదండరాం
అంతకుముందు తెలంగాణలో ఆరో దశ స్ఫూర్తియాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగిస్తామని రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఆయన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని జేఏసీ బృందంతో వెళ్లి కలిశారు.

నల్గొండ జిల్లాలో స్ఫూర్తియాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తమ యాత్రకు అనుమతి ఇవ్వకుండా జేఏసీ ప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని మంత్రికి వవరించినట్లు కోదండరాం తెలిపారు.
అయితే నాయిని నుంచి ఎలాంటి సంతృప్తికరమైన సమాధానం రాలేదని.. అనుమతి అంశంపై డీజీపీతో మాట్లాడతానని చెప్పారని వివరించారు. పోలీసులు అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా తాము మాత్రం యాత్రను చేపట్టితీరుతామని స్పష్టం చేశారు. అయితే, నాయినితో భేటీ అయిన కాసేపటికి కోదండరాంను అరెస్ట్ చేయడం గమనార్హం.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications