కోమటిరెడ్డి సోదరులకు రివర్స్: చెప్పులు చూపించడంపై ఆగ్రహం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శిక్షణా శిబిరం సందర్భంగా తమను వేదిక పైకి ఆహ్వానించలేదని కోమటిరెడ్డి సోదరులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు అలక వహించారు.

కెసిఆర్‌కు షాక్: ఆలోగా బిజెపిలోకి డి శ్రీనివాస్ తనయుడు అరవింద్

తద్వారా వారు సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ నేతల నుంచి వారికి మద్దతు లభించలేదని, పైగా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నినాదాలు చేస్తూ వెళ్లిపోవడం నేతలకు ఆగ్రహం తెప్పించింది.

వ్యక్తిగత ఇమేజ్ కోసం పాకులాడవద్దని..

వ్యక్తిగత ఇమేజ్ కోసం పాకులాడవద్దని..

కోమటిరెడ్డి సోదరులు పెద్ద ఎత్తున మద్దతుదారులతో వచ్చారు. అలా తాము కూడా రాగలమని ఇతర నేతలు అంటున్నారు. పార్టీ బలోపేతం కోసం కాకుండా వ్యక్తిగత ఇమేజ్ కోసం పాకులాడటం సరికాదని కొందరు అంటున్నారు.

వెళ్తూ చెప్పులు చూపించారు

వెళ్తూ చెప్పులు చూపించారు

శనివారం జరిగిన శిక్షణ శిబిరంలోకి వచ్చిన కోమటిరెడ్డి సోదరులు దాదాపు రెండు గంటలపాటు అక్కడే కూర్చున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి మాట్లాడే సమయంలో వాళ్లు అలకబూని వెళ్లిపోయారు. ఆ సమయంలో వారి అనుచరులు నినాదాలు చేస్తూ చెప్పులు చూపించడం విమర్శలకు తావిచ్చిందని అంటున్నారు.

వ్యూహాత్మక మౌనం

వ్యూహాత్మక మౌనం

ఈ విషయాన్ని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా తీవ్రంగా పరిగణిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో తెలంగాణ నేతలు వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు. కోమటిరెడ్డి సోదరులు సెల్ఫ్ గోల్ చేసుకున్నారని అంటున్నారు.

ఉద్దేశ్యపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని

ఉద్దేశ్యపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని

పార్టీ బాధ్యతలు అప్పగిస్తే గాడిలో పెడతామని కోమటిరెడ్డి సోదరులు పదేపదే చెబుతున్నారు. మరోవైపు కావాలనే తమను టార్గెట్‌ చేస్తున్నారని కోమటిరెడ్డి వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. టిపిసిసి చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే తమ నేతలను అవమానిస్తున్నారంటున్నారు. శంషాబాద్‌ శిబిరంలో చివరగా వచ్చిన రేణుకా చౌదరిని వేదికపైకి పిలిచి, కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఆహ్వానించకపోవడం ఏమిటని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that Komatireddy brothers self goal in Telangana Congress Party meeting on saturday. Party senior leaders are very serious on Komatireddy brothers for their behaviour.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి