మాకు టిడిపి మద్దతు, ఈ ఎన్నికలు సెమీఫైనల్సే: ఎమ్మెల్సీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి

హైదరాబాద్: నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 లేదా 5 స్థానాలు గెలుస్తామన్నారు. నల్గొండలో తమకు తెలుగుదేశం పార్టీ మద్దతుందని చెప్పారు.

మంగళవారం ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ స్థానాన్ని తనకు కేటాయించినందుకు అధినాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, నిజామాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి ఎంపికయ్యారు.

 Komatireddy on MLC elections

ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు షురూ

ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. నల్గొండ జిల్లా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి సోమవారం నామినేషన్ ను దాఖలు చేశారు. తేరా చిన్నపరెడ్డి పేరును టిఆర్ఎస్ పార్టీ మొదటి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తరపున నల్గొండ మున్సిపల్ చైర్మన్ బోడ్డుపల్లి లక్ష్మీ, స్థానిక ఎంపీటీసీలు నామినేషన్ వేశారు. తెలంగాణలో హైదరాబాద్ మినహా 9 జిల్లాలలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు డిసెంబర్ 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.

టిఆర్ఎస్ అభ్యర్థులు వీరే

నల్గొండ - డాక్టర్ తేరా చిన్నపురెడ్డి, నిజామాబాద్ - డాక్టర్ భూపతిరెడ్డి, ఖమ్మం - బాలసాని లక్ష్మీనారాయణ, మెదక్ - వి. భూపాల్‌రెడ్డి, కరీంనగర్ 1- నారదాసు లక్ష్మణ్‌రావు, కరీంనగర్ 2 - భానుప్రసాద్‌రావు పేర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారని కె.కేశవరావు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+