మంత్రి పదవి ఇస్తానని! అవమానించారు: టీఆర్ఎస్‌పై కొండా సురేఖ ఆగ్రహం

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు తొలి విడత ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చేసిన తప్పేంటని టీఆర్ఎస్ అధిష్టాన్ని ప్రశ్నించారు.

Recommended Video

    సొంత‌గూటికి టీఆర్‌ఎస్ నేతలు....!

    తీవ్రంగా బాధించింది..

    తీవ్రంగా బాధించింది..

    తొలి జాబితాలో తన పేరును ప్రకటించకపోవడం తీవ్రంగా బాధించిందని కొండా సురేఖ తెలిపారు. ఇది బీసీలను, మహిళలను అవమానించినట్లేనని ఆమె అన్నారు. తాను గత ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేయాలని అనుకుంటే.. ఎన్నికలకు 3నెలలు ముందుగానే టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తనను కలవాలని కోరిందని తెలిపారు. పరకాల టికెట్ ఇస్తే పార్టీలో చేరతామని చెప్పామని.. అయితే, వరంగల్ తూర్పు నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ కోరిందని చెప్పారు.

    కన్నీళ్లు వచ్చాయి..

    కన్నీళ్లు వచ్చాయి..

    అప్పుడు సొంత నియోజకవర్గం పరకాలను వదిలిపెట్టాలంటే కన్నీళ్లు వచ్చాయని కొండా సురేఖ చెప్పారు. బస్వరాజు సారయ్యను ఓడించాలంటే మీరు వరంగల్ తూర్పు నుంచి పోటీ చేయాలని టీఆర్ఎస్ అధిష్టానం సూచించిందని అన్నారు. దీంతో తాను అక్కడ్నుంచి పోటీ చేసి 55వేల మెజార్టీతో గెలిచానని చెప్పారు. టీఆర్ఎస్ నుంచి రూపాయి తీసుకోకుండా గెలిచామని చెప్పారు.

    మంత్రి పదవి ఇస్తానని..

    మంత్రి పదవి ఇస్తానని..

    తమ పార్టీ నుంచి పోటీ చేసి గెలిస్తే మంత్రి పదవి కూడా ఇస్తామని టీఆర్ఎస్ చెప్పిందని కొండా సురేఖ చెప్పారు. ఆ తర్వాత దాన్ని మర్చిపోయారని అన్నారు. అయినా తాము పార్టీని ఎప్పుడూ దీనిపై ప్రశ్నించలేదని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పార్టీ నుంచి డబ్బులు తీసుకోకుండానే గెలిపించామని చెప్పారు.
    కొండా మురళి కూడా ఎమ్మెల్సీగా సొంతంగానే గెలిచారని తెలిపారు.

     మహిళలకు స్థానం ఎక్కడ?

    మహిళలకు స్థానం ఎక్కడ?

    తాము బీఫాం తప్ప పార్టీ నుంచి ఎలాంటి ప్రయోజనం పొందలేదని కొండా సురేఖ తెలిపారు. మంత్రి పదవులు తనకు తృణప్రాయమని అన్నారు. ఒక్క మహిళా మంత్రి లేకుండా కొనసాగిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అంది టీఆర్ఎస్ సర్కారేనని కొండా సురేఖ మండిపడ్డారు. తాను పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ పనిచేయలేదని చెప్పారు. పార్టీకి నష్టం చేసే ఏ చర్యకూ పాల్పడలేదని అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+