నాడు 2 రాష్ట్రాల గొడవ: కెటిఆర్, లోకేష్ తెలియదు.. బాబు గురించి చెప్తా: తలసాని

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం సమయంలో రెండు రాష్ట్రాల మధ్య మాత్రమే గొడవ జరిగిందని, రెండు వీధుల మధ్య కాదని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం నాడు అన్నారు.

బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కెపిహెచ్‌బి కాలనీలో బ్రాహ్మణ చైతన్య సదస్సుకు కెటిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు. రానున్న మూడేళ్లలో హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. హైటెక్ సిటీని నిర్మించామన్న నేతలు హైదరాబాదులో ఫుట్‌పాత్‌లు కూడా నిర్మించలేదన్నారు.

KTR and Talasani in GHCM campaign

లోకేష్ తెలియదు.. చంద్రబాబు గురించి చెబుతా: తలసాని

తనకు నారా లోకేష్ ఎవరో తెలియదని, ఏపీ సీఎం చంద్రబాబు గురించి అడిగితే చెబుతానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సెటిలర్స్ అనే పదం తనకు నచ్చదన్నారు. ఇక్కడ పుట్టిన వారికి జీవించే హక్కులు ఉంటాయన్నారు.

బిజెపి నియోజకవర్గాల్లో ప్రధానితో మాట్లాడి 1000 డబుల్ బెడ్ రూం ఇళ్లు తీసుకు రావాలని సవాల్ చేశారు. ఐటీ రంగాన్ని టిడిపి కంటే తెరాసనే ఎక్కువ అభివృద్ధి చేస్తోందన్నారు. మజ్లిస్ పార్టీతో తమకు ఎలాంటి లోపాయకారి ఒప్పందం లేదన్నారు.

అయ్యప్ప సొసైటీ రగడ పైన మాట్లాడుతూ.. అక్కడ సీమాంధ్రులతో పాటు తెలంగాణ వారు ఉన్నారని చెప్పారు. అయ్యప్ప సొసైటీలో కూల్చివేతను రాజకీయం చేశారన్నారు. అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలు ఎవరివైనా కూల్చివేశామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+