రాజకీయ సన్యాసం తీసుకుంటా: ఉత్తమ్‌కు కేటీఆర్ సవాల్, ‘ఆ గబ్బు వదలాలంటే..’
జోగులాంబగద్వాల: కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు. కాంగ్రెస్ పార్టీ పాలనా గబ్బును వదిలించాలంటే నాలుగేళ్లు సరిపోవని, మరో 20ఏళ్లు పడుతుందని అన్నారు.
జోగులాంబ గద్వాల్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గద్వాల్ మండలం గూడూరులో చేనేత పార్కు, మౌలిక సదుపాయాలు, పరిపాలన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు లక్ష్మా రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, గద్వాల నియోజకవర్గ ఇంఛార్జ్ కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ ఛైర్మన్ బండారి భాస్కర్ పాల్గొన్నారు. అనంతరం గద్వాలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పాల్గొని మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.

రాజకీయ సన్యాసం అంటూ సవాల్
2019లో రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. అదే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటాడా? అని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం.. అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఓట్లెందుకెస్తారు?
వచ్చే ఎన్నికల్లో వందకు వందశాతం గులాబీ జెండానే ఎగురుతదన్నారు. ఏం చేసిందని కాంగ్రెస్‌కు ప్రజలు ఓట్లు వేస్తరని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎక్కడి నుంచి 70 సీట్లు గెలుస్తదన్నారు. రాహుల్‌గాంధీ సొంత సీటులోనే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.

అడ్డుపడ్డ సీమాంధ్ర నేతలు
ఒకే రోజు రూ. 40 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని, గద్వాలలో రూ. 14 కోట్లతో చేనేత పార్క్‌కు శంకుస్థాపన చేశామని కేటీఆర్ చెప్పారు. దేశంలోని ఆడబిడ్డలందరికీ గద్వాల పట్టుచీరలంటే ప్రాణమని అన్నారు. ‘తెలంగాణ వస్తే ఏమొస్తదని కొందరు నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. తెలంగాణ వస్తే అంధకారమైతదని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నరు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో చాలా నష్టపోయిన జిల్లా మహబూబ్‌నగర్. నిజాం హయాంలో పాలమూరును సస్యశ్యామలం చేయడానికి అప్పర్ కృష్ణా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 1945లో పాలమూరు జిల్లాలో 16 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి అప్పర్ కృష్ణా చేపట్టారు. అప్పర్ కృష్ణా ప్రాజెక్టును నాటి సీఎం బూర్గుల రామకృష్ణారావు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే సీమాంధ్ర నేతలు అడ్డుపడ్డరు. ఆంధ్రాతో కలిసిన పాపానికి.. కాంగ్రెస్ చేసిన దాష్టికానికి పాలమూరు ఆగమైపోయింది' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

డీకే అరుణ, జైపాల్ రెడ్డిపై విమర్శలు
అంతేగాక, ‘స్వాతంత్య్రానికి పూర్వమే మైనర్ ఇరిగేషన్ ద్వారా పాలమూరు జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. నెహ్రు నుంచి రాహుల్‌గాంధీ వరకు తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేశారు. ఉద్యమ సమయంలో తాను జాతీయవాదినంటూ తప్పించుకున్న చరిత్ర జైపాల్‌రెడ్డిది. పాలమూరుకు నీళ్లివ్వకుండా అనంతపురంకు కృష్ణా నీళ్లు తరలిస్తుంటే హారతులు పట్టింది గద్వాల ఎమ్మెల్యే అరుణ కాదా? ప్రజలకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేని దద్దమ్మలు కాంగ్రెస్ నేతలు' అని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.

మరో 20ఏళ్లు కేసీఆరే
ఆర్డీఎస్ ఆయకట్టు కోసమే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. తుమ్మిళ్ల ఎత్తిపోతలతో 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. రైతులకు ఎకరానికి రూ. 4 వేలు పెట్టుబడి ఇస్తానన్న సీఎం దేశంలో ఎవరైనా ఉన్నారా? అని అడిగారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. మరో 20 ఏళ్ల దాకా తెలంగాణలో కేసీఆరే ముఖ్యమంత్రి అని కేటీఆర్ స్పష్టం చేశారు.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..












Click it and Unblock the Notifications