రూ. 45వేలు డెబిట్ కార్డు ద్వారా చెల్లించి పట్టుచీరల కొనుగోలు
రూ. 45వేలు డెబిట్ కార్డు ద్వారా చెల్లించి పట్టుచీరల కొనుగోలు
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్దేశానికి మరింత ప్రచారం కలిగించేలా మంత్రి కేటీఆర్.. తన డెబిట్ కార్డును ఉపయోగించి పట్టు చీరలు కొనుగోలు చేశారు.
వివరాల్లోకి వెళితే.. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని దండుమల్కాపురంలోని అపెరల్ టెక్స్ టైల్స్ పార్కును సందర్శించారు మంత్రి కేటీఆర్. అక్కడి చీరలను చూసిన ఆయన.. ఎంతో బాగున్నాయంటూ అబ్బురపడ్డారు.

అక్కడ తయారైన పట్టు చీరలను చూసి ముగ్ధుడైన కేటీఆర్.. తన తల్లి, చెల్లెలు, సతీమణి కోసం మూడు పట్టు చీరలు కొన్నారు. చెల్న దేశాయ్ రూపొందించిన ఈ పట్టు చీరలతో పాటు రెండు పట్టు పావడాలను రూ. 45 వేలు పెట్టి కొనుగోలు చేశారు కేటీఆర్. కాగా ఆ మొత్తాన్ని తన డెబిట్ కార్డును స్వైప్ చేయడం ద్వారా చెల్లించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేతన్నల కోసం కొత్త పాలసీని తేనున్నామని, అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులను పెంచనున్నామని స్పష్టం చేశారు. వస్త్రాలను నేరుగా కొనుగోలు చేస్తామని, ఆపై మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు.
-
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications