14న ఆఫీసుకని వెళ్లిన మహిళా టెక్కీ కనిపించకుండా పోయింది
హైదరాబాద్ : కార్యాలయంలో సమావేశం ఉందని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీరు కనిపించకుండా పోయింది. ఈ సంఘటన హైదరాబాదులోని మొఘల్‌పురా పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. లాల్ దర్వాజా నాగుల చింత ప్రాంతానికి చెందిన శ్రీకృష్ణ కూతురు స్నేహ (25) ఈ నెల 14వ తేదీ నుచంి కనిపించడం లేదు.
స్నేహ గచ్చిబౌలిలోని హిందూజా గ్లోబల్ సొల్యుషన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తోంది. ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఆఫీసులో సమావేశం ఉిందని చెప్పి చెప్పి ఇంటినుంచి వెళ్లింది. ఆ తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికారు.

అయినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నల్లగొండ జిల్లాలోని చిట్యాల సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న కారును సుమో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్సకై సమీపంలోని ఆసుపత్రికి స్థానికులు తరలించారు. హైదరాబాద్ నుంచి కారు విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications