నేను మాట్లాడితే బావుండదు: ఏపీ-తెలంగాణ రాజకీయాలపై లగడపాటి
హైదరాబాద్: తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, అలాంటప్పుడు వాటి గురించి మాట్లాడనని విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ బుధవారం నాడు అన్నారు. ఆయన తాను కొత్తగా కొన్న స్కోడా కారు రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాదులోని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు.
తెలంగాణ: ఇంకా రాజకీయాలొద్దని లగడపాటి, 'పెప్పర్ స్ప్రే కేసు...'
ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రవాణాశాఖ కమిషనర్లను కలిశారు. లగడపాటి వద్దకు వెళ్లిన మీడియా ప్రతినిధులు.. ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడాలని కోరారు. దానికి ఆయన పైవిధంగా స్పందించారు. మాట్లాడితే బాగుండదన్నారు.

నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలు: జగదీశ్వర్ రెడ్డి
తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించేందుకు నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలు నిర్మించనున్నట్లు మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బుధవారం ముప్పయ్యవ ఒలింపిక్ రన్-2016 కార్యక్రమం నిర్వహించారు.
లగడపాటి 'ల్యాంకో' కుదేలు: బ్యాంకుల చేతికి మరో తెలుగు కంపెనీ..!
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ఛైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మనిషి జీవితంలో క్రీడలు ఒక భాగంగా ఉండాలని, రాష్ట్రంలో 64 స్టేడియాలు నిర్మాణంలో ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలను నిర్మిస్తామని, క్రీడారంగంలో రాజకీయాలు ఉండకూడదన్నారు. ప్రతి పాఠశాలలో పీఈటీలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications