చిన్నారిని చంపేసి మూటలో కట్టి సజ్జ మీద పెట్టేశారు
హైదరాబాద్: మూడు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైన మూడున్నర ఏళ్ల వయస్సు గల చిన్నారి లాస్య (పండు) శుక్రవారం శవమై కనిపించింది. ఆ చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. హైదరాబాదులోని సనత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని దీన్‌దయాల్‌నగర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
దీన్‌దయాల్‌నగర్‌కు చెందిన నవీన్, మయూరి దంపతుల కూతురు లాస్య బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటి బయట రోడ్డుపై కూర్చున్న తాత వద్దకు వెళ్లింది. కాసేపటి తర్వాత తల్లి బయటకు వెళ్ల చూడగా లాస్య కనిపించలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా, శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో పక్కింటి సజ్జ మీది నుంచి దుర్వాసన వస్తుండడంతో అనుమానం వచ్చి అక్కడ గాలించారు. అక్కడున్న మూటలో తమ పాప మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పాప గొంతుపై కోసిన ఆనవాళ్లున్నాయి. ఈ ఘటనలో స్థానికులు దేహశుద్ధి చేసి ఓ మహిళను పోలీసులకు అప్పగించారు.
అదృశ్యమైన బాలుడు సురక్షితం
ఇదిలావుంటే, హైదరాబాదు సమీపంలోని హయత్‌నగర్ సూర్యనగర్ కాలనీలో అదృశ్యమైన బాలుడు సురక్షితంగా ఇంటికి చేరాడు. నాలుగు రోజుల క్రితం ఇంటి సమీపంలో ఆడుకుంటున్న నవీన్ అనే ఏడేళ్ల బాలుడిని గుర్తు తెలియని దుండగులు అపహరించారు. నవీన్ శుక్రవారం అర్థరాత్రి ఇంటికి చేరుకున్నాడు.












Click it and Unblock the Notifications