వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.902 కోట్ల లిక్కర్ సేల్స్, గతేడాది కంటే తెలంగాణలో డబుల్, క్లోజ్ చేస్తారని..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వారం రోజుల్లో రూ.902 కోట్ల లిక్కర్ విక్రయాలు జరిగాయి. సాధారణంగా కన్నా.. డబుల్ సేల్స్ జరుగుతున్నాయని ఎక్సైజ్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల్లో ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయి. దీనికి తోడు వైన్స్ మళ్లీ మూసివేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో మద్యం కొనుగోలు చేసి.. కొందరు స్టాక్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి.

16 శాతం ధర పెంచి..

16 శాతం ధర పెంచి..

కరోనా వైరస్ వల్ల దాదాపు నెలన్నర పాటు మద్యం షాపులు మూసివేసిన సంగతి తెలిసిందే. వైన్ షాపులు తెరిచేందుకు కేంద్ర హోంశాఖ అనుమతి ఇవ్వడంతో ఈ నెల 6 వ తేదీ నుంచి మద్యం షాపులను ఓపెన్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 16 శాతం లిక్కర్‌‌‌‌ రేట్ పెంచి విక్రయిస్తున్నారు. 6వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు రూ.902 కోట్ల విలువగల మద్యం డిపోల నుంచి వైన్స్‌‌‌‌కు తరలించారు. అప్పటినుంచి.. రోజుకు సగటున రూ.129 కోట్ల మద్యాన్ని విక్రయించారు.

8వ తేదీన 190 కోట్లు..

8వ తేదీన 190 కోట్లు..

ఈ నెల 8వ తేదీన అత్యధికంగా రూ.190 కోట్ల మద్యం విక్రయాలు‌ జరిగాయి. 10న రూ.37 కోట్ల విక్రయాలు చేశా రు. ఆదివారం కావడంతో డిపోల నుంచి తక్కువగా లిక్కర్‌‌‌‌ తరలించినట్లు తెలుస్తోంది. గతేడాది మే నెల మొత్తం రూ.1,847 కోట్ల అమ్మకాలు జరిగాయి. అంటే సగటున రూ.60 కోట్లే అమ్మారు. ఈసారి మాత్రం రూ.129 కోట్లతో డబుల్‌‌‌‌ విక్రయాలు జరిగాయి.

గ్రేటర్ పరిధిలో..

గ్రేటర్ పరిధిలో..

గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ పరిధిలోని జిల్లాల్లో ఎక్కువగా లిక్కర్‌‌‌‌ సేల్స్‌ జరిగాయి. హైదరాబాద్‌‌‌‌, రంగారెడ్డి, మేడ్చల్‌‌‌‌ జిల్లాల్లో రెండేసి డిపోలు ఉన్నాయి. మిగతా చోట్ల ఒక్కో డిపో ఉంది. 11వ తేదీ వరకు ఉన్న లెక్కల ప్రకారం రంగారెడ్డి జిల్లాలో ఉన్న రెండు డిపోల పరిధిలో అత్యధికంగా రూ.103.55 కోట్ల లిక్కర్​ విక్రయాలు జరిగాయి. మేడ్చల్‌‌‌‌లోని రెండు డిపోల్లో రూ.94.9 కోట్లు, హైదరాబాద్‌‌‌‌ రెండు డిపోల్లో రూ.79.99 కోట్ల చొప్పున సేల్‌‌‌‌ అయ్యాయి. వనపర్తి జిల్లాలోని డిపోలో తక్కువగా రూ.29.55 కోట్లే వచ్చాయి.

Recommended Video

AP CM YS Jagan Review Meeting On Coronavirus Pandemic @ Tadepalli
మూసివేస్తారని..

మూసివేస్తారని..

లాక్‌‌‌‌డౌన్‌‌ వల్ల నెలన్నరగా లిక్కర్​ దొరకలేదు. కొన్ని చోట్ల బ్లాక్‌‌‌‌లో అధిక ధరకు విక్రయించారు. లిక్కర్‌‌‌‌ దొరక్క కొందరు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తే.. మరికొందరు చనిపోయిన సంగతి తెలిసిందే. మళ్లీ వైన్స్‌‌‌‌ బంద్‌‌‌‌ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకైనా మంచిదని కొందరు పెద్ద మొత్తంలో లిక్కర్‌‌‌‌ను కొని స్టోర్‌‌‌‌ చేసుకుంటున్నారు.

English summary
liquor sales double in telangana state. 902 crores sales in week days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X