Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోకసభ ఎన్నికలు 2019: మహబూబ్‌నగర్ నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

Recommended Video

    Lok Sabha Election 2019 : Mahaboobanagar Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report

    తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ స్థానం నుంచి గెలుపొందిన వారు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకొన్న చరిత్ర ఉంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ఏపీ జితెందర్ రెడ్డి లోక్‌సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2014, మే 18న ఆయన రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించారు.

    2014 లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా జితేందర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి ఎస్ జైపాల్ రెడ్డిపై 2590 ఓట్ల తేడాతో గెలుపొందారు. జితేందర్ రెడ్డికి 334,228 ఓట్లు పోలవ్వగా, జైపాల్ రెడ్డికి 331,638 ఓట్లు వచ్చాయి.

    ఉస్మానియా యూనివర్సిటీలో పట్టబద్రులైన జితేందర్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన వయస్సు 64 సంవత్సరాలు. ఇప్పటి వరకు లోక్‌సభలో పలు అంశాలపై జరిగిన చర్చల్లో 83 సార్లు పాలుపంచుకొన్నారు. తెలంగాణకు సంబంధించిన అంశాలను 36.7 శాతం మేర లేవనెత్తారు. దేశాభివృద్దికి సంబంధించిన విషయంలో 63.8 శాతం మేర చర్చల్లో పాలుపంచుకొన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం రూ.25.6 కోట్ల మేర ఏంపీ లాడ్స్ మంజూరు కాగా, రూ.18.64 కోట్ల మేర నియోజకవర్గం అభివృద్ది పనులకు ఖర్చు చేశారు.

    #LokSabhaElection2019: All about mahabubnagar Constituency

    ఎంపీగా జితేందర్ రెడ్డి 4 ప్రైవేట్ బిల్లులను ప్రవేశపెట్టిన ఘనత ఉంది. 2 సార్లు రాష్ట్రానికి సంబంధించిన ప్రైవేట్ బిల్లులను, మరో 2 సార్లు దేశానికి సంబంధించిన ప్రైవేట్ బిల్లులను ప్రవేశపెట్టారు. తన పదవీకాలంలో 173 ప్రశ్నలను పార్లమెంట్‌లో సంధించారు. 285 సార్లు రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై మాట్లాడగా, 273 సార్లు దేశ భవిష్యత్‌ను ప్రభావితం చేసే ప్రశ్నలపై తన గళాన్ని వినిపించారు. పార్లమెంట్‌లో ఆయన హాజరు 86 శాతం ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు. అందులో రాష్ట్రానికి సంబంధించిన సమావేశాల్లో ఆయన హాజరు 69 శాతంగా నమోదైంది.

    మహబూబ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 2,008,729 జనాభా ఉంది. ఇందులో 80 శాతం గ్రామీణ ప్రజలు, 20 శాతం పట్టణ ప్రజలు ఉన్నారు. ఈ జనాభాలో 15 శాతం ఎస్సీలు, 9 శాతం ఎస్టీకి చెందిన వారున్నారు. 2014 ఎన్నికల ముందు నమోదైన గణాంకాల ప్రకారం.. మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో 14,18,672 ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్ల సంఖ్య 709,711. మహిళా ఓటర్ల సంఖ్య 708,961.

    2014 పార్లమెంట్ ఎన్నికల్లో 1,014,800 ఓట్లు పోలయ్యాయి. అందులో 511,764 మంది పురుషులు, 503,036 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఈ నియోజకవర్గంలో 72 శాతం పోలింగ్ నమోదైంది.

    మహబూబ్‌నగర్ లోక్‌సభ పరిధిలో కోడంగల్, నారాయణ్‌పేట్, మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ లోకసభ స్థానం నుంచి పది సార్లు కాంగ్రెస్ పార్టీ గెలువగా, ఒక్కసారి తెలంగాణ ప్రజా సమితి తరఫున 1971 నుంచి 1977 వరకు జే రామేశ్వర్ రావు ప్రతినిథ్యం వహించారు. జనతా పార్టీ తరఫున ఎస్ జైపాల్ రెడ్డి రెండుసార్లు, భారతీయ జనతాపార్టీ తరుపున ఒకసారి (1999-2004), రెండోసారి (2014-) టీఆర్ఎస్ తరుపున ఏపీ జితేందర్ రెడ్డి ప్రాతినిథ్యం వహించారు. ఒక్కసారి టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు 15వ లోక్‌సభకు ప్రాతినిత్యం వహించారు.

    2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డి విఠల్ రావు తన ప్రత్యర్థి టీడీపీకి చెందిన వై ఎల్లారెడ్డిపై 47907 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కే చంద్రశేఖర్ రావు తన సమీప ప్రత్యర్థి డీ విఠల్ రావుపై 20,184 మెజారిటీతో గెలిచారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+