Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోకసభ ఎన్నికలు 2019: సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

Recommended Video

    Lok Sabha Election 2019 : Secunderabad Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report

    తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలలో సికింద్రాబాద్ ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి ఒక్కసారి మాత్రమే గెలిచారు. అది మినహాయించి, 1957 నుంచి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాత్రమే ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. 1957 నుంచి 1971 వరకు మూడుసార్లు కాంగ్రెస్ నుంచి నారాల సాయికిరణ్ (రెండుసార్లు), అలీ మీర్జా (ఒక్కసారి) గెలిచారు. 1971లో నారాల సాయికిరణ్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు.

    ఆ తర్వాత 1977 నుంచి 1991 వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. శివశంకర్ రెండుసార్లు, తుంగతుర్తి అంజయ్య ఒక్కసారి, టీ మణెమ్మ రెండుసార్లు గెలించారు. 1991లో పదో లోకసభకు ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థి బండారు దత్తాత్రేయ గెలిచారు. 1996లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి పీవీ నర్సింహా రావు విజయం సాధించారు. 1998లో, 1999లో తిరిగి బీజేపీ నుంచి బండారు దత్తాత్రేయ విజయం సాధించారు.

    2004లో, 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ గెలిచారు. 2004లో దత్తాత్రేయ పైన పోటీకి కాంగ్రెస్ నుంచి ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో అంజన్ కుమార్‌ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఓ మహా నాయకుడిపై గెలిచానని అంజన్ కుమార్ పలుమార్లు పేర్కొన్నారు. దత్తాత్రేయపై గెలుపు కష్టమని కాంగ్రెస్ నేతలు భావించగా, ఆ గెలుపు సాధారణమైనది కాదని అంజన్ అభిప్రాయపడ్డారు. 2014లో తిరిగి దత్తాత్రేయ (బీజేపీ) విజయం సాధించారు.

    1957లో రెండో లోకసభ నుంచి 2014 పదహారో లోకసభ వరకు ఎన్నికలు జరిగాయి. పదిహేనుసార్లు లోక్‌సభ ఎన్నికలు, ఆరో లోకసభ తర్వాత, ఎనిమిదో లోకసభ తర్వాత ఒక్కోసారి ఉప ఎన్నికలు జరిగాయి.

    #LokSabhaElection2019: All about secunderabad Constituency

    2014లో దత్తాత్రేయ గెలిచారు. ఆ తర్వాత కేంద్రమంత్రి అయ్యారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దత్తాత్రేయకు 4,38,271 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్‌కు 1,83,536 ఓట్లు మాత్రమే వచ్చాయి. మజ్లిస్ అభ్యర్థి నార్ల మోహన్ రావుకు 2,12,120 ఓట్లు వచ్చాయి. దత్తాత్రేయ 2,54,735 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

    గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలతో పాటు వైయస్సార్ కాంగ్రెస్, బీఎస్పీ, అఖిల భారతీయ ముస్లీం లీగ్ (సెక్యులర్), సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, మజ్లిస్ మర్కాజ్ ఈ సియాసీ, ఆర్పీఐ(కే), జనతంత్ర పార్టీ, ఆర్ఎస్పీ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తదితర పార్టీలు పోటీ చేశాయి. స్వతంత్రులు కూడా పెద్ద ఎత్తున పోటీ చేశారు.

    సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో జూబ్లీహిల్స్, అంబర్‌పేట, నాంపల్లి, ముషీరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపినాథ్ (తెరాస), అంబర్ పేట నుంచి కాలేరు వెంకటేష్ (తెరాస), నాంపల్లి నుంచి జాఫర్ హుస్సేన్ (మజ్లిస్), ముషీరాబాద్ నుంచి ముఠా గోపాల్ (తెరాస), సికింద్రాబాద్ నుంచి పద్మారావు (తెరాస), ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ (తెరాస), సనత్ నగర్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ (తెరాస)లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

    ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో దాదాపు 19 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పది లక్షలకు మందికి పైగా పురుష ఓటర్లు, ఎనిమిది లక్షలకు మందికి పైగా ఓటర్లు మహిళా ఓటర్లు.

    ప్రస్తుతం ఎంపీ బండారు దత్తాత్రేయ పైన సదభిప్రాయమే ఉంది. అయితే వయసు మీదపడుతుండటం ఆయనకు మైనస్. అంబర్‌పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్ నియోజకవర్గాలలో బీజేపీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది.

    సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని వారు దాదాపు అన్ని రంగాల్లో ఉన్నారు. ముషీరాబాద్, అంబర్‌పేట, నాంపల్లి వంటి చోట్ల మిడిల్ క్లాస్ మొదలు జూబ్లీహిల్స్ వంటి చోట్ల ధనవంతులు నివసించే నియోజకవర్గాలు సికింద్రాబాద్ లోకసభ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. సాఫ్టువేర్ ఇంజినీర్లు, వ్యాపారులు.. ఇలా అన్ని రంగాల వారు ఉన్నారు.

    సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఎంపీగా ఉన్న బండారు దత్తాత్రేయ గ్రాడ్యుయేట్ చేశారు. వయస్సు 71. లోకసభలో మూడు చర్చల్లో పాల్గొన్నారు. స్టేట్ డిబేట్ యావరేజ్ 9.1 శాతంగా, నేషనల్ డిబేట్ యావరేజ్ 14.6గా ఉంది. ప్రయివేటు మెంబర్ బిల్స్ ఏమీ పెట్టలేదు. పార్లమెంటులో 12 ప్రశ్నలు అడిగారు. తెలంగాణ ఎంపీలు అడిగిన ప్రశ్నల యావరేజ్ 77 శాతంగా ఉండగా, నేషనల్ యావరేజ్ 75 శాతంగా ఉంది. దత్తాత్రేయకు సభలో 79 శాతం హాజరు ఉంది. రాష్ట్ర ఎంపీల యావరేజ్ 69 శాతంగా మాత్రమే ఉంది. సికింద్రాబాద్ పరిధిలో 1,893,647 (2014) ఉన్నారు. ఇందులో 1,012,378 పురుష ఓటర్లు, 881,269 మహిళా ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీగా దత్తాత్రేయ రూ.12.42 కోట్లు ఖర్చు పెట్టారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+