మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్‌ ప్రయాణీకులకు గుడ్ న్యూస్

భారతీయ రైల్వేలో ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే దృక్పథంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల పునరాభివృద్ది పనులు చేపట్టడం ద్వారా గొప్ప పరివర్తన దిశగా పురోగమిస్తుంది. " అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్" (ఏ.బి.ఎస్.ఎస్.) కింద, తెలంగాణ వ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్‌లను రూ. 2,737 కోట్ల అంచనా వ్యయంతో, ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలను అందించడానికి మరియు వాటిని ప్రాంతీయ జనాభాకు వృద్ధి కేంద్రాలుగా మార్చడానికి పునరాభివృద్ది చేయబడుతున్నాయి. ప్రధాన మంత్రి మోడీ ఆగస్టు 2023 మరియు ఫిబ్రవరి, 2024లో తెలంగాణ రాష్ట్రంలో స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేయడంతో ఈ పధకానికి మరింత ప్రోత్సాహం లభించింది.

ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులను ఈ జాబితాలో చేర్చారు. వాటితో పాటుగా జంట నగరాల ప్రాంతంలో ఇప్పటికే ఉన్న ఇతర రైలు టెర్మినళ్లలో రద్దీని తగ్గించడానికి చర్లపల్లి స్టేషన్ సకల సౌకర్యాలతో అభివృద్ధి చేయబడింది మరియు నగర ప్రజల సౌకర్యార్థం ప్రత్యామ్నాయ టెర్మినల్‌గా అవతరించింది. రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే స్టేషన్‌లను ఆధునీకరించడం, దీర్ఘకాలిక దృష్టితో నిరంతర ప్రాతిపదికన అభివృద్ధిని చేయడం లక్ష్యంగా పెట్టుకుని అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ విధానాన్ని రూపొందించింది. ఈ ఆలోచన ఎప్పటికప్పుడు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మరియు రైల్వే స్టేషన్‌ల ప్రోత్సాహాన్ని పెంచే మాస్టర్ ప్లాన్ ప్రకారం వివిధ కీలక అంశాల అమలుపై ఆధారపడింది.

ఇందులో భాగంగా, జంట నగరాల సమీపంలో ఉన్న మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్‌ను పునరాభివృద్ధికి చేపడుతున్నారు. మొత్తం మీద, ప్రతిపాదిత పనులలో ఇప్పటివరకు 60 శాతం పూర్తయ్యాయి. అదే సమయంలో అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయి మరియు ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడమైనది. మల్కాజ్‌గిరి స్టేషన్ పునరాభివృద్ధిని సుమారు రూ.27.61 కోట్ల వ్యయంతో చేపట్టారు.

Malkajgiri railway station being redeveloped at a cost of Rs 27 61 crore
భారతదేశం వ్యాప్తంగా రైల్వే స్టేషన్లను పునరాభివృద్ది చేసే లక్ష్యంతో అమృత్ భారత్ స్టేషన్ పథకం (ఏ.బి. ఎస్.ఎస్.) కింద పునరాభివృద్ధి చేయబడుతున్న తెలంగాణలోని 40 రైల్వే స్టేషన్లలో మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ ఒకటి. మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ గొప్ప చరిత్ర, సాంస్కృతిక ప్రాముఖ్యత మరియు ఆధునిక సౌకర్యాలతో, ఈ ప్రాంత రవాణా నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషిస్తూనే ఉంది.
మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ జంట నగరాలలో కమ్యూటర్ రైలు రవాణాకు కేంద్రంగా ఉంది. ఇది సబర్బన్ స్టేషన్, సికింద్రాబాద్ నుండి కేవలం 3 కి.మీ దూరంలో ఉంది. ఈ స్టేషన్‌ను ప్రయాణీకులకు అనుకూలమైన వివిధ సౌకర్యాలతో పునరాభివృద్ది చేస్తున్నారు, వాటిలో విశాలమైన కాన్కోర్స్, వెయిటింగ్ హాల్స్, ఫుడ్ స్టాల్స్ మరియు రెస్ట్‌రూమ్‌లు ఉన్నాయి. దివ్యాంగ ప్రయాణీకులకు ప్రత్యేక టాయిలెట్లు మరియు ర్యాంప్‌లు వంటి సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి.

• మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్ హైదరాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది మరియు దీనిని సబర్బన్ గ్రేడ్-3 (ఎస్. జి -3)గా వర్గీకరించబడింది.
• సికింద్రాబాద్- మన్మాడ్ సెక్షన్‌లో నున్న ఈ స్టేషన్ రూ 5.48 కోట్ల వార్షిక ఆదాయంతో సగటున రోజుకు 2500 మంది ప్రయాణీకుల రాకపోకలతో ప్రయాణీకులకు సేవలను అందిస్తుంది.
• మల్కాజ్‌గిరి స్టేషన్‌లో దాదాపు 27జతల రైళ్లు ఆగుతాయి.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ప్రణాళిక చేయబడిన పనులు :
• స్టేషన్ భవనం ముఖద్వారం అభివృద్ధి
• ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారం ఏర్పాటు
• ప్రయాణీకుల సౌకర్యార్థం 12 మీటర్ల వెడల్పు గల పాదాచారుల వంతెన (ఫుట్ ఓవర్ బ్రిడ్జి) నిర్మాణంతో పాటు 3 లిఫ్టులు & 3 ఎస్కలేటర్ల ఏర్పాటు.
• ప్లాట్‌ఫామ్ ఉపరితల మెరుగుదలలు
• ప్లాట్‌ఫారమ్‌పై అదనపు కప్పు ఏర్పాటు
• ఇప్పటికే ఉన్న టాయిలెట్లకు మెరుగుదలలు, దివ్యాంగుల సౌకర్యాలతో సహా కొత్త టాయిలెట్ బ్లాకుల నిర్మాణం
• వెయిటింగ్ హాల్‌ అభివృద్ధి
• స్టేషన్ వినియోగదారులకు ఆహ్లాదకరమైన ప్రాకృతిక అనుభవాన్ని అందించడానికి స్టేషను ఆవరణలో పచ్చదనాన్ని పెంచడం, ట్రాఫిక్ సజావుగా సాగడానికి స్టేషన్ ప్రాంగణం మెరుగుదల
• స్టేషన్ ప్రాంతాలలో కళలు మరియు సంస్కృతి చిత్రీకరణ
• ప్రయాణీకులకు అనుకూలమైన సంకేతాలు , రైలు సూచిక బోర్డులు, కోచ్ సూచిక బోర్డులు మొదలైనవి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+