'కేటీఆర్ మంత్రి హోదాను పక్కన పెట్టి ఈవెంట్ మేనేజర్‌గా వ్యవహరించారు'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనయుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రమోషన్‌కు గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సదస్సు వేదిక అయిందని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం మండిపడ్డారు.
కేటీఆర్ మంత్రి హోదాను మరిచిపెట్టి ఈవెంట్ మేనేజర్‌గా వ్యవహరించారని ఎద్దేవా చేశారు. స్వయం సహాయక సంఘాలను తెరాస చంపేసిందని మండిపడ్డారు.

కాంగ్రెస్ హయాంలో మహిళా సంఘాలకు రూ.5000 కోట్ల రుణాలు ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మెట్రో ప్రారంభంలోను ప్రోటోకాల్ పాటించలేదని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications