దారుణం: నగరంలోని మ్యాన్‌హోల్‌కు నిండు ప్రాణం బలి (ఫోటోలు)
హైదరాబాద్: డ్రైనేజీ మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసేందుకు దిగిన పారిశుధ్ధ్య కార్మికుడు ఊపిరాడక మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. స్ధానికుల కథనం ప్రకారం చిలకలగూడ జలమండలి పరిధి అడిక్‌మెట్ డివిజన్ పోచమ్మ బస్తీ (అంజయ్య నగర్)లోని పోచమ్మ దేవాలయం ముందు నుంచి గిరిజన బాలికల వసతి గృహం వరకు రహదారిపై తరచూ డ్రైనేజీ పొంగుతోంది.
దీంతో ఎయిర్ టెక్ యంత్రంతో మ్యాన్ హోళ్లను శుభ్రం చేసేందుకు పారిశుధ్ద్య రాములుతో పాటు ఒప్పంద కార్మికుడు రాంబాబు, సిబ్బంది వచ్చారు. పోచమ్మ దేవాలయం ముందున్న నాలుగు మ్యాన్‌హోళ్లను ఆదివారం ఉదయం శుభ్రం చేశారు.

నగరంలోని మ్యాన్‌హోల్‌కు నిండు ప్రాణం బలి
డ్రైనేజీ మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసేందుకు దిగిన పారిశుధ్ధ్య కార్మికుడు ఊపిరాడక మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

నగరంలోని మ్యాన్‌హోల్‌కు నిండు ప్రాణం బలి
స్ధానికుల కథనం ప్రకారం చిలకలగూడ జలమండలి పరిధి అడిక్‌మెట్ డివిజన్ పోచమ్మ బస్తీ (అంజయ్య నగర్)లోని పోచమ్మ దేవాలయం ముందు నుంచి గిరిజన బాలికల వసతి గృహం వరకు రహదారిపై తరచూ డ్రైనేజీ పొంగుతోంది.

నగరంలోని మ్యాన్‌హోల్‌కు నిండు ప్రాణం బలి
దీంతో ఎయిర్ టెక్ యంత్రంతో మ్యాన్ హోళ్లను శుభ్రం చేసేందుకు పారిశుధ్ద్య రాములుతో పాటు ఒప్పంద కార్మికుడు రాంబాబు, సిబ్బంది వచ్చారు. పోచమ్మ దేవాలయం ముందున్న నాలుగు మ్యాన్‌హోళ్లను ఆదివారం ఉదయం శుభ్రం చేశారు.

నగరంలోని మ్యాన్‌హోల్‌కు నిండు ప్రాణం బలి
ఆ తర్వాత పోచమ్మ బస్తీ, అంజయ్య నగర్ బస్తీలకు మధ్యలో గిరిజన వసతి గృహం ఎదురుగా ఉన్న దాదాపు 35 అడుగుల లోతైన డ్రైనేజీ మ్యాన్‌హోల్ నుంచి మట్టి, వ్యర్ధాలను తొలగించేందుకు రాములు లోపలికి దిగాడు.

నగరంలోని మ్యాన్‌హోల్‌కు నిండు ప్రాణం బలి
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంతి తలెత్తి స్పృహ కోల్పోయి మురుగులో పడిపోయాడు. రాంబాబు అతన్ని బయటకు తీసేందుకు లోపలికి దిగుతూ శ్వాస అందక అస్వస్థతకు గురయ్యాడు. అతన్ని స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించారు.

నగరంలోని మ్యాన్‌హోల్‌కు నిండు ప్రాణం బలి
కొనఊపిరితో కొట్టమిట్టాడిన రాములు చివరకు మరణించాడు. మృతదేహాన్ని బయటకు తీయడానికి ఎవరూ సాహసం చేయలేకపోయారు. చివరకు క్యాటరింగ్ బాయ్ నాగరాజు చొరవతో మృతదేహాం బయటక తీయగలిగారు.

నగరంలోని మ్యాన్‌హోల్‌కు నిండు ప్రాణం బలి
ఆలస్యంగా వచ్చిన జీహెచ్ఎంసీ అధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించి తిరిగి వెళ్లిపోయారు. కాచిగూడ ఎసీపీ లక్ష్మీ నారాయణ, నల్లకుంట సీఐ సంతోష్ కిరణ్, ఎస్సై సుధాకర్ రెడ్డి వచ్చి పరిస్థితిని సమీక్షించారు.












Click it and Unblock the Notifications