నయీం లింక్స్: మల్‌రెడ్డికి మంచిరెడ్డి సవాల్
మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. పరస్పర ఆరోపణలతో ఇబ్రహీంపట్నంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి నయీంతో సంబంధాలున్నట్లుగా మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆరోపించడంతో ఈ వివాదానికి తెరలేసింది. ఇరువురు మంత్రుల మధ్య ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఆరోపణల పర్వం సాగుతోంది. మల్ రెడ్డి ఆరోపణల పట్ల తీవ్రంగా స్పందించిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. తన అనుచరులతో కలిసి స్థానిక చౌరస్తాలో బైఠాయించారు. ఈ సందర్బంగా మంచిరెడ్డి మాట్లాడుతూ.. దమ్ముంటే.. మల్ రెడ్డి తనతో చర్చకు రావాల్సిందిగా సవాల్ చేశారు. మరో రెండు గంటలపాటు చౌరస్తాలోనే బైఠాయిస్తానని చెప్పిన కిషన్ రెడ్డి.. మల్ రెడ్డి వచ్చి నయీంతో తనకున్న సంబంధాలను రుజువు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications