సెల్ఫీ కావాలంటే..: హైదరాబాదీలకు మేయర్ బొంతు ఆఫర్!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఇటీవల హైదరాబాదులో ఒకే రోజు లక్షలాది మొక్కలు నాటి రికార్డ్ సృష్టించారు.
హరితహారంలో భాగంగా హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తాజాగా ఓ కొత్త ప్లాన్ తెరపైకి తెచ్చారు. తనతో సెల్ఫీ దిగాలనుకునే వారు మొక్క నాటాలని ఆయన చెబుతున్నారు. మొక్క నాటితో ఆయనతో సెల్ఫీ దిగవచ్చు.
10 వేల కిలోమీటర్ల పొడవు హరితహారం: జూపల్లి
పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21న రాష్ట్రంలో పదివేల కిలో మీటర్ల పొడవునా హరితహారం కార్యక్రమం నిర్వహించనున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టారన్నారు.

దేశంలోనే సీఎం కేసీఆర్ నెంబర్ వన్ సీఎంగా నిలవడం రాష్ర్టాభివృద్ధికి నిదర్శనమన్నారు. అలాంటి ముఖ్యమంత్రిని బీజేపీ నేతల నాగం జనార్ధన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి, డీకే అరుణ, టీడీపీ నేత రేవంత్ రెడ్డి విమర్శిస్తూ మతిభ్రమించినట్టు మాట్లాడుతున్నారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం రాజకీయ కార్యక్రమం కాదని, ఒక సామాజిక కార్యక్రమం అని మంత్రి జోగు రామన్న అన్నారు. ఇందులో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.
ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని నాటిన మొక్కలను కాపాడాల్సిన బాధ్యత కూడా వారిదేనన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల భాగస్వామ్యంతో హరితోద్యమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ నెల 18న అన్ని మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications