వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెడికల్ కళాశాలల రగడ: తెలంగాణాకు కేంద్రం షాక్; టీఆర్ఎస్ రివర్స్ ఎటాక్; అసలు ఏది నిజం!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కళాశాలలు ఇవ్వలేదని పదే పదే కేంద్ర సర్కారు టార్గెట్ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి పార్లమెంటు సాక్షిగా కేంద్రం షాక్ ఇచ్చింది. అసలు తమ వద్దకు ప్రపోజల్స్ రాలేదని పేర్కొన్న కేంద్రం తెలంగాణ ప్రభుత్వం అబద్ధాలు చెబుతుంది అంటూ తేల్చేసింది. తాము అనేక మార్లు విజ్ఞప్తి చేశామని కేంద్రమే పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు చెప్తుంది అంటూ తెలంగాణ ప్రభుత్వం ఎదురు దాడి చేస్తుంది. అసలు ఈ వ్యవహారంలో ఎవరు అబద్ధాలు చెబుతున్నారు, కేంద్రమా? తెలంగాణా ప్రభుత్వమా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ .. మెడికల్ కళాశాలల రగడ

టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ .. మెడికల్ కళాశాలల రగడ

తెలంగాణ రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పార్టీకి, కేంద్రంలోని అధికార బీజేపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ప్రతి విషయంలోనూ రెండు పార్టీలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడం ప్రధానంగా కనిపిస్తుంది. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి సహకరించటంలేదని, కనీసం మెడికల్ కళాశాలను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందని టిఆర్ఎస్ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తుంటే, అసలు తమకు ప్రపోజల్స్ పంపించలేదని కేంద్రం తేల్చి చెబుతోంది.

తెలంగాణా మెడికల్ కళాశాలలపై కేంద్రం క్లారిటీ

తెలంగాణా మెడికల్ కళాశాలలపై కేంద్రం క్లారిటీ

తాజాగా శుక్రవారం లోక్సభలో ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ తెలంగాణ మెడికల్ కళాశాలలపై లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జిల్లా హాస్పటల్ లను మెడికల్ కళాశాలలుగా మార్చేందుకు ప్రపోజల్స్ ఇవ్వాలని కోరినా తెలంగాణ ప్రభుత్వం పంపించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

2014 లో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలలు లేని జిల్లాలలో ప్రధాన హాస్పిటల్ లను మెడికల్ కాలేజీలు గా తీర్చిదిద్దడం కోసం ఒక స్కీమ్ ను ప్రారంభించామని, స్కీం లో భాగంగా అన్ని రాష్ట్రాలకు కలిపి మూడు దశల్లో 157 కళాశాలను మంజూరు చేసిన నిధులను ఇచ్చామని పేర్కొన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎటువంటి స్పందన లేదని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎటువంటి ప్రపోజల్స్ రాకపోవడంతో తెలంగాణ కు మెడికల్ కళాశాల ఇవ్వలేకపోయాము అని మంత్రి తేల్చిచెప్పారు.

మెడికల్ కళాశాలలపై కేంద్ర మంత్రి చెప్పింది పచ్చి అబద్దాలు: హరీష్ రావు

మెడికల్ కళాశాలలపై కేంద్ర మంత్రి చెప్పింది పచ్చి అబద్దాలు: హరీష్ రావు

ఇక కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మెడికల్ కళాశాలల పై కేంద్రమంత్రి అబద్ధాలు చెబుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015 నుంచి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తులు చేస్తుందని పేర్కొన్న మంత్రి హరీష్ రావు, కేంద్రం తర్వాత చూద్దాం అంటూ దాటవేత ధోరణి అవలంభిస్తున్నది అంటూ మండిపడ్డారు. కేంద్రానివి పచ్చి అబద్ధాలు అంటూ హరీష్ రావు ధ్వజమెత్తారు.

పార్లమెంట్ సాక్షిగా కేంద్రం గోబెల్స్ ప్రచారం

పార్లమెంట్ సాక్షిగా కేంద్రం గోబెల్స్ ప్రచారం

మొన్న తెలంగాణ నుంచి గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలు రాలేదని చెప్పిన కేంద్రం ఈ రోజు మెడికల్ కాలేజీల ఏర్పాటు పైన పచ్చి అబద్ధాలను చెబుతోందని హరీష్ రావు పేర్కొన్నారు. ఏకంగా పార్లమెంటులోనే గోబెల్స్ ప్రచారం సాగిస్తుందని హరీష్ రావు పేర్కొన్నారు. కేంద్రం సహకరించక పోయినా సీఎం కెసిఆర్ నేతృత్వంలో జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

 మెడికల్ కాలేజీల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశాం

మెడికల్ కాలేజీల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశాం

గతంలో ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్ కు అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులు రాసిన లేఖలను ట్వీట్ చేసిన మంత్రి హరీష్ రావు కరీంనగర్, ఖమ్మం జిల్లా లోని జిల్లా హాస్పిటల్ లను మెడికల్ కళాశాలలుగా మార్చేందుకు నిధులు ఇవ్వాలని లేఖలు రాసినట్టు పేర్కొన్నారు .మెడికల్ కళాశాల కోసం రాష్ట్రంలో ఇప్పటికే అనేక సార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని విమర్శించారు.

కేంద్రం పదే పదే అబద్ధాలను వల్లె వేస్తుంది అంటూ హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి చెప్పడం బాధాకరమని వెల్లడించారు. తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతున్న కేంద్రం కావాలని తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందంటూ ధ్వజమెత్తారు.

ఇరు వర్గాల భిన్న వాదన... మెడికల్ కళాశాలలపై నో క్లారిటీ

ఇరు వర్గాల భిన్న వాదన... మెడికల్ కళాశాలలపై నో క్లారిటీ

మొత్తానికి అసలు మెడికల్ కళాశాలలకు సంబంధించిన ప్రపోజల్స్ పంపించలేదని కేంద్రం, ఎన్నో సార్లు ప్రపోజల్స్ పంపించామని, అనేకమార్లు లేఖలు రాశామని, కేంద్రానికి విజ్ఞప్తి చేసినా లాభం లేకుండా పోయిందని, కేంద్ర అబద్ధాలు చెబుతుందని మండిపడుతున్న టీఆర్ఎస్ సర్కార్ ప్రకటన వెరసి, అబద్ధం చెప్పింది ఎవరు? అసలు మెడికల్ కళాశాలలకు ప్రపోజల్ పంపించారా లేదా? ప్రపోజల్స్ పంపించినా ఇతర రాష్ట్రాలకు కేటాయించి నిజంగానే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కళాశాలలు ఇవ్వకుండా అన్యాయం చేస్తోందా? అన్న ప్రశ్నలకు ఇరువర్గాలు చేస్తున్న వ్యాఖ్యలతో క్లారిటీ లేకుండా పోయింది.

English summary
The Center has given a shock to Telangana in the wake of the medical colleges establishment. Said no proposals had been sent for the medical colleges. The TRS claimed that the center had lied. What is actually true is now a matter of debate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X