Rains In Telangana: వచ్చే నాలుగు రోజులు తెలంగాణలో వర్షాలు..!
తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు తీరంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పటినట్లు పేర్కొంది. ఆవర్తన ద్రోణి సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్లు చెప్పింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాత్రి సమయంలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
మంగళవారం నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వానలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. బుధవారం మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపెల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాసశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

గురువారం కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి నిర్మల్, మంచిర్యాల, ములుగు, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. శుక్రవారం కుమురంభీమ్ ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలో అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
ఇటు హైదరాబాద్ లో మంగళవారం ఉదయం నుంచి చిరు జల్లులు పడుతున్నాయి. ఆకాశం మేఘావృతం అయింది. ఉష్ణోగ్రత కూడా తగ్గినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో వర్షపాతం లోటు ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. హత్నీ కుండ్ బ్యారేజీ నుంచి హర్యానా దాదాపు 2,13,679 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో యమునా నది నీటిమట్టం ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద 204.50 మీటర్లకు చేరింది.












Click it and Unblock the Notifications