Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆలేర్ ఎన్‌కౌంటర్‌పై మజ్లీస్ పట్టు: చర్చిద్దామన్న కెసిఆర్

హైదరాబాద్: ఆలేరు ఎన్‌కౌంటర్‌పై తక్షణమే చర్చించాలని మజ్లీస్ పార్టీ సభ్యులు తెలంగాణ శాసనసభలో కొద్దిసేపు పట్టుబట్టారు. ఎన్‌కౌంటర్‌పై వెంటనే చర్చించాలంటూ మజ్లీస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ పట్టుబట్టారు. ఆలేరు ఎన్‌కౌంటర్‌పై మజ్లీస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ మధుసూదనాచారి మంగళవారం తిరస్కరించారు. అయితే, వెంటనే చర్చ జరగాలని అక్బరుద్దీన్ పట్టుబట్టారు.

ప్రభుత్వం వికారుద్దీన్ ఎన్‌కౌంటర్‌పై చర్చించడానికి సిద్ధంగా ఉందని, ఈ రోజు రైతు ఆత్మహత్యలపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నామని, రైతుల సమస్యలు అత్యంత తీవ్రమైనవని, అందువల్ల ఈ సమస్యలపై చర్చ ముగిసిన తర్వాత ఆ విషయంపై చర్చిద్దామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పారు. దాంతో మజ్లీస్ సభ్యులు సద్దుమణిగారు.

MIM members stressed for the debate on Alair encounter

ఆలేర్ ఎన్‌కౌంటర్‌పై తగిన రూపంలో వస్తే చర్చకు అనుమతిస్తామని స్పీకర్ మధుసూదన చారి పదే పదే చెప్పారు. సమస్య తీవ్రత దృష్ట్యా రైతు సమస్యలపై చర్చిద్దామని నిర్ణయం తీసుకున్నామని, ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా రద్దు చేసుకుని చర్చకు చేపడుతున్నామని ఆయన చెప్పారు.

నిబంధనల ప్రకారం ముందుకు వస్తే ఆలేరు ఎన్‌కౌంటర్‌పై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని శాసనసభా పక్ష నేత హరీష్ రావు చెప్పారు. దానిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, ఇప్పుడు రైతు సమస్యలపై చర్చకు సహకరించాలని ఆయన అన్నారు.

ఎర్రబెల్లి దయాకర్ రావుపై జరిగిన దాడిపై అంతకు ముందు తెలుగుదేశం పార్టీ సభ్యులు స్పీకర్ మధుసూదనాచారికి ఫిర్యాదు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+