అఖిలేష్ యాదవ్ పిలుపు: లక్నోకు బయలుదేరిన మంత్రి కెటిఆర్

హైదరాబాద్/లక్నో: తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం నాడు ఉత్తర ప్రదేశ్ వెళ్లారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ కుమార్ యాదవ్‌తో మంత్రి కెటిఆర్ సమావేశం కానున్నారు.

జలహారం వివరాలను యూపీ సీఎంకు వివరించనున్నారు. మంత్రి వెంట అధికారులు రేమాండ్ పీటర్, సురేందర్ రెడ్డి ఉన్నారు. కేటీఆర్‌కు యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ నుంచి ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. దీనిపై సానుకూలంగా స్పందించిన కేటీఆర్ అధికారుల బృందంతో గురువారం యూపీ రాజధాని లక్నో బయలుదేరారు.

తెలంగాణలో ప్రతి ఇంటికి తాగు నీటి సరఫరా కోసం ప్రభుత్వం చేపడుతున్న జలహారం (వాటర్ గ్రిడ్) పథకం పైన అఖిలేశ్ యాదవ్ ఆసక్తి కనబర్చారు. ఆ పథకంపై పూర్తి వివరాలు కావాలంటూ ఆయన కేటీఆర్‌ను కోరారని సమాచారం. జలహారంపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అఖిలేశ్‌కి వివరించనున్నారని తెలుస్తోంది.

Minister KTR leave for Lucknow

కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ గొప్ప పథకమని అఖిలేశ్ యాదవ్ ప్రశంసించిన విషయం తెలిసిందే. ఈ పథకం అమలుపై తన అధికారుల ద్వారా పూర్తిస్థాయి సమాచారం తెప్పించుకున్న అఖిలేశ్.. దాని తీరు తెన్నులతో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి తాగునీటిని అందించేందుకు జలహారం పథకాన్ని పెద్దఎత్తున చేపట్టినందుకు పంచాయతీరాజ్‌, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావుని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ అభినందించారు.

వాటర్‌గ్రిడ్ పథకంపై తమకు తెలంగాణ ఇంజినీర్ల ద్వారా తెలియజేయాలని మంత్రి కేటీఆర్‌ను అఖిలేశ్ కోరారు. ఇందుకోసం అక్టోబర్ 15న యూపీకి రావాలని మంత్రి కేటీఆర్ బృందానికి ఆహ్వానం పలికారు. తాగునీటి రంగంలో వాటర్ గ్రిడ్ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అఖిలేశ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+