జబ్బును నయం చేస్తానని మైనర్ బాలికను ఇలా.. బాధితురాలు అలా....
ప్రార్థనలు, నాటు వైద్యం ద్వారా జబ్బులను నయం చేస్తానని అహ్మద్ అనే లారీ డ్రైవర్ ప్రజలను మోసం చేస్తున్నాడు. ఓ బాలికకు జబ్మును నయం చేస్తానని చెప్పి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
హైదరాబాద్:ప్రార్థనలతోపాటు నాటు వైద్యం ద్వారా జబ్బులను నయం చేస్తానని ఓ వ్యక్తి ప్రజలను మోసం చేస్తున్నాడు.అంతేకాదు తనను నమ్మి తన వద్దకు వచ్చిన వారిని నట్టేట ముంచుతున్నాడు.ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని డబ్బులు గుంజుతున్నాడు. అంతేకాదు ఓ బాలికకు జబ్బును నయం చేస్తానని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.

హైద్రాబాద్ పాతబస్తీలోని అసద్ బాబా నగర్ లో అహ్మద్ నివాసం ఉంటాడు. ఆయన లారీ డ్రైవర్ గా పనిచేస్తాడు. నాటు వైద్యం, ప్రార్థనల ద్వారా జబ్బులను నయం చేస్తానని ప్రచారం చేసుకొనేవాడు. ఈ ప్రచారాన్ని నమ్మి ఆయన వద్దకు వస్తుంటారు.
ఈ ప్రచారాన్ని నమ్మిన అదే బస్తీకి చెందిన 17 ఏళ్ళ బాలికను ఆమె తల్లి అహ్మద్ వద్దకు తీసుకువచ్చింది.ఇటీవల కాలంలో ఆ బాలికకు ఆరోగ్యం సరిగా ఉండడం లేదు.దీంతో అహ్మద్ వద్దకు తీసుకువచ్చింది.
అయితే మూడు రోజులుగా అహ్మద్ వద్దకు బాలికను తీసుకెళ్ళింది తల్లి.అయితే ఆమె పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు.దీంతో సోమవారం నాడు సాయంత్రం ఏడున్నర గంటలకు బాలికకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నట్టు నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
దీంతో బాలిక తన తల్లికి విషయాన్ని వెల్లడించింది. దీంతో బాధిత కుటుంబసభ్యులు బహదూర్ పుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం నయాపూల్ ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications