హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో భారీగా గంజాయి స్వాధీనం.. విలువ రూ. 3 కోట్లకు పైనే..

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో గంజాయి గుప్పుమంటుంది. ప్రతి రోజు ఏదో ఒక చోట భారీగా గంజాయి పట్టుబడుతోంది. పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నా గంజాయి ముఠా దొడ్డిదోవలో అక్రమ రవాణాకు పూనుకుంటున్నారు. ఇవాళ ఒక్క రోజే పలుచోట్ల 3 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజమహేంద్రవరం నుంచి నాందేడ్ కు తరలిస్తుండగా సదాశివపేట వద్ద పోలీసులు కాపు కాసి గంజాయి పట్టుకున్నారు.

2 కోట్ల విలువైన ఎండు గంజాయి స్వాధీనం

2 కోట్ల విలువైన ఎండు గంజాయి స్వాధీనం


రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పోలీసులు గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్టవేశారు. రెండు వేర్వేరు చోట్ల జరిపిన దాడుల్లో భారీగా ఎండు గంజాయి పట్టుబడింది. సదాశివపేట మండలం నందికంది వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో 2 కోట్ల విలువైన ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి సుమారు వెయ్యి కిలోలకు పైగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

రాజమండ్రి టు నాందేడ్

రాజమండ్రి టు నాందేడ్


గంజాయిని రాజమండ్రి నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు తరలిస్తున్నట్లు విచారణలో తేలినట్లు జిల్లా ఎస్పీ రమణకుమార్ వెల్లడించారు. పట్టుబడిన లారీలో 500 ప్యాకెట్లు.. ఒక్కోటి 2 కిలోల చొప్పున ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా కోహిర్ మండలం పీచేర్యాగడిలోనూ భారీగా ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరు విశాఖ మన్యం నుంచి ముంబాయికి ఈ గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన 140 కిలోల గంజాయి విలువ సుమారు రూ.21 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితుల నుంచి 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ములుగు జిల్లాలో భారీగా గంజాయి ప‌ట్టువేత‌

ములుగు జిల్లాలో భారీగా గంజాయి ప‌ట్టువేత‌


అటు.. ములుగు జిల్లాలోనూ 612 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగంపేట మండలం తిమ్మంపేట క్రాస్ వద్ద పోలీసుల తనిఖీలలో ఈ గంజాయి పట్టుబడింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.90 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ వెల్లడించారు. నిర్మల్ జిల్లా కడెం మండలం కన్నడ గ్రామానికి చెందిన వెంబటి రాజశేఖర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రాజశేఖర్ మరో నలుగురు వ్యక్తులతో కలిసి భద్రాత్రి కొత్తగూడెం జిల్లా మోతుగూడెం అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద ఈ గంజాయి కోనుగోలు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో ఎవరైనా గంజాయి సాగు చేసినా పక్కరాష్ట్రాల నుంచి తరలించిన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ హెచ్చరించారు.

English summary
Telangana Police seized Huge amount of ganjai
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X