ప్రియుడి కోసం 2ఏళ్ళ బిడ్డను చంపేందుకు నీకు మనసెలా వచ్చింది.. నీదొక బ్రతుకేనా!

ఆడవాళ్లు ఆడతనాన్ని మర్చిపోతున్నారు. రాక్షసులుగా మారుతున్నారు. వివాహేతర సంబంధాలు పెట్టుకుని భర్తలను, చివరికి పిల్లలను కూడా హత మారుస్తున్నారు. తాజాగా అటువంటి ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రియుడు కోసం కడుపున పుట్టిన రెండేళ్ల పాపను కర్కశంగా కడతేర్చింది ఓ ఇల్లాలు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పాతిపెట్టి ప్రియుడితో పారిపోయింది. వివరాలలోకి వెళితే

మే నెల నుండి మాయమైన తల్లీ కూతుళ్ళు
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్ పల్లి కి చెందిన బొట్టు మమతకు, బంటు భాస్కర్ దంపతులకు ఇద్దరు సంతానం. ఒక కొడుకు, కూతురు. అయితే మమతకు తన తల్లిగారి గ్రామమైన శభాష్ పల్లి గ్రామానికి చెందిన షేక్ ఫయాజ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే మే నెల నుంచి మమత ఆమెతోపాటు కుమార్తె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

mother killed her 2 years old daughter for lover in medak district

గుంటూరు జిల్లాలో తల్లిని, ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మమత గుంటూరులో ఉందని గుర్తించి మమతను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. రెండేళ్ల కుమార్తె గురించి మమతను విచారణ చేసిన పోలీసులకు షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని, గుంటూరు జిల్లా నరసరావుపేట నుండి శభాష్ పల్లికి వచ్చి శభాష్ పల్లి శివారులోనే పాపని చంపి పాతి పెట్టి, మళ్ళీ తిరిగి నరసరావుపేటకు వెళ్ళిపోయారు.

చిన్నారిని చంపిన కర్కశ తల్లి
ఇక ఈ విషయం మమత, ఆమె ప్రియుడు ఇద్దరు పోలీసులు ముందు ఒప్పుకున్నారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి శవాన్ని బయటకు తీశారు. తహసిల్దార్ తో పాటు డాక్టర్ల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే గతంలో కూడా మమత ప్రియుడితో పారిపోవడంతో ఆమె ప్రవర్తన పైన భర్త అభ్యంతరం వ్యక్తం చేసి ఆమెతో కలిసి జీవించడానికి నిరాకరించాడు.

తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని చిన్నారి హత్య
భర్త నిరాకరించిన మమత తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఈ క్రమంలో ఐదేళ్ల కొడుకును తల్లిదండ్రుల దగ్గర వదిలేసి, మళ్లీ ప్రియుడితో పారిపోయింది. రెండేళ్ల కుమార్తె అడ్డుగా ఉందని అత్యంత కర్కశంగా చంపి ప్రియుడితో పరార్ అయింది ఈ కర్కశ తల్లి. వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు నేడు వీరిని కోర్టులో హాజరు పరిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+