ఎన్నికల్లో పోటీ పై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన..!!

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి కీలక ప్రకటన చేసారు. కొంత కాలంగా కోమటిరెడ్డి బీజేపీలో చేరుతున్నారంటూ ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తన పోటీకి సంబంధించి ప్రకటన చేసారు. కాంగ్రెస్ తో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. నల్గొండ ప్రజలతో తాను మమేకం అయ్యానని చెప్పుకొచ్చారు. 20 ఏళ్లుగా నిజాయితీగా నల్గొండను అభివృద్ధి చేసానన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ తీరుపైన గతంలో పలు మార్లు మండిపడ్డ కోమటిరెడ్డి ఇప్పుడు వచ్చే ఎన్నికలపై స్పందించారు.

ఇప్పటి వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లో ఉంటారా, బీజేపీలో చేరుతారా అనే డైలమా కొనసాగింది. దీని పైన కోమటిరెడ్డి పార్టీతో పాటుగా తాను పోటీ చేసే నియోజకవర్గం పైన క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ అభ్యర్దిగానే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను నల్గొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. ఏప్రిల్ 28వ తేదీన నల్గొండలో నిర్వహించే నిరుద్యోగ దీక్ష గురించి తనకు తెలియదన్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా జూన్ మొదటి వారంలో నల్గొండలో సభ నిర్వహిస్తామని, ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరవుతారని చెప్పారు. నల్గొండలో ప్రియాంక గాంధీ టూర్ ను సక్సెస్ చేస్తామని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.

 komatireddy-

కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాలుగు సార్లు నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 2009లో వైఎస్సార్ కేబినెట్ లో మంత్రిగా పని చేసారు. ఆ తరువాత రోశయ్య కేబినెట్ లో మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ కోసం రాజీనామా చేసారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ది కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. తరువాత జరిగిన లోక్ సభ ఎన్నిక ల్లో భువనగిరి నుంచి గెలుపొందారు. ఇప్పుడు తిరిగి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకే పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే నియోజవకర్గంలో పర్యటనలు, కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ముందు నుంచే తన పోటీ గురించి స్పష్టత ఇస్తున్నారు.

 komatireddy-

కాంగ్రెస్ ముఖ్య నేత ప్రియాంక సభ నల్గొండలో ఏర్పాటు చేయటం ద్వారా ఇక అధికారికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని కోమటిరెడ్డి భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు పెంచాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండను దత్తత తీసుకున్న కేసీఆర్ ముస్లింలు, దళితులు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించి..ఇవ్వాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో, ఇక కోమటిరెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగటం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+