అవినీతికి తావివ్వకుండా పని చేయాలి.!నూతన ప్రొబేషనరీ ఆరెఎస్సైలకు సీపీ స్టీఫెన్ రవీంద్ర హితవు
హైదరాబాద్ : సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ నూతన ప్రొబేషనరీ రిజర్వుడ్ సబ్ ఇన్సెక్టర్లకు దిశానిర్దేశం చేసారు. 2020 బ్యాచ్ కు చెందిన 23 మంది నూతన ప్రొబేషనరీ రిజర్వ్ సబ్-ఇన్ స్పెక్టర్లు సోమవారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని ఉద్దేశించి సీపి ప్రసంగించారు. విధి నిర్వహణలో ఎంత ధైర్య సాహసాలు కనబరుస్తుంటామో అంతే నిబద్దగా, అవినీతికి దూరంగా ఉండాలని సూచించారు. ప్రజలు పోలీసు వ్యవస్ధ మీద విశిష్టమైన విశ్వాసంతో ఉంటారని ఆ నమ్మకాన్ని వమ్ము చేయొద్దని స్టీఫెన్ రవీంద్ర హితవు పలికారు.

ప్రొబేషనరీ రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్లకు సీపీ సూచన..సీపీని కలిసిన నూతన ప్రొబేషనరీ ఆర్ఎస్ఐలు
ఇదిలా ఉండగా గ్రే హౌండ్స్, ఐఎస్ డబ్ల్యూ, సీఎస్డబ్ల్యూ, ట్రాఫిక్, పీటీఓ వంటి వివిధ విభాగాల్లో క్షేత్ర స్థాయిలో శిక్షణ పూర్తి చేసుకుని సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్లో రిపోర్ట్ చేశారు. 23 మంది రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్లల్లో (పురుషులు 20, మహిళలు 03 మంది) ఉన్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడారు. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఉండాలని కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఆర్ఎస్ఐలకు సూచించారు. నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో పని చేయాలన్నారు. పోలీసులు శారీరక ధృడత్వంతో పాటు మానసిక పరిపక్వతతో ఉండాలన్నారు. పోలీస్ శాఖ క్రమశిక్షణ కలిగిన డిపార్ట్ మెంట్ అన్నారు.

విధి నిర్వహణలో అలసత్వం వద్దు.. నూతన ఎస్సైలకు స్టీఫెన్ రవీంద్ర దిశానిర్దేశం..
ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో అలసత్వం వహించరాదన్నారు స్టీఫెన్ రవీంద్ర. ప్రజల మేలు కోసం నిబద్ధతతో పని చేసి తెలంగాణ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఆధునిక పోలిసింగ్ పై దృష్టి సారించాలన్నారు. పెరుగుతున్న ఆన్ లైన్ మోసాల దృష్ట్యా ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన, లోన్ యాక్ట్స్ వంటి విషయాలపై జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ప్రొబేషనరీ ఆర్ఎస్ఐల విద్యార్హతకు అనుగుణంగా వారి సేవలను వినియోగించుకుంటామన్నారు. సిబ్బంది మేనేజ్‌మెంట్, టైమ్ మేనేజ్‌మెంట్ పై దృష్టి సారించాలన్నారు.

ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు.. నిజాయితీగా వ్యవహరించాలన్న సీపీ
ఇదిలా ఉండగా విధి నిర్వహణలో మరణించిన ఏఎస్ఐ కుటుంబానికి సైబరాబాద్ సీపి స్టీఫెన్ రవీంద్ర చేతులమీదుగా ఆర్థిక సహాయం అందజేసారు ఆ కుటుంబానికి బరోసా కల్పించారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లోని అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వర్తిస్తూ, రోడ్డు ప్రమాదంలో మరణించిన మహ్మద్ రవూఫ్ కుటుంబ సభ్యులకు సోమవారం సైబరాబాద్ సీపీ ఆఫీసులో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., చేతులమీదుగా చెక్కును అందజేశారు.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఎస్సైకి నష్టపరిహారం.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన స్టీఫెన్ రవీంద్ర
దూలపల్లి చౌరస్తా లో మహ్మద్ రవూఫ్ విధులు నిర్వర్తిస్తుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన క్వాలిస్ వాహనము బలంగా ఢీ కొట్టగా మహ్మద్ రవూఫ్ తలకు బలమైన గాయం తగిలి మరణించారు. ఈ సందర్భంగా స్టీఫెన్ రవీంద్ర ఏఎస్ఐ మహ్మద్ రవూఫ్ కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. భద్రత శాఖ నుంచి ఏఎస్ఐ రావూఫ్ కుటుంబ సభ్యులకు 7,88,240రూపాయల చెక్కును సీపీ అందజేశారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ రియాజ్, సైబరాబాద్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications