వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ అవినీతికి తెరలేపారు! జైలుకు పంపుతా: కేసీఆర్‌పై నాగం జనార్ధన్ రెడ్డి నిప్పులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గత కొంత కాలంగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్న కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి తాజా రాజకీయ పరిస్థితులపై తీవ్రంగా స్పందించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును జైలుకు పంపేవరకు పోరాడుతానని నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో నాగం జనార్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ సర్కారును తలదన్నేలా జగన్ ప్రభుత్వం: పవన్ కళ్యాణ్, విశాఖలో భారీ ర్యాలీకేసీఆర్ సర్కారును తలదన్నేలా జగన్ ప్రభుత్వం: పవన్ కళ్యాణ్, విశాఖలో భారీ ర్యాలీ

కేసీఆర్‌ను జైలుకు పంపేవరకు

కేసీఆర్‌ను జైలుకు పంపేవరకు

తెలంగాణను సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారని ఆరోపించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చేశారని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతిపై పోరాటం చేస్తానని, ఆయనను జైలుకు పంపుతానని అన్నారు. రూ. 24వేల కోట్ల విలువైన బీటీ రహదారుల కాంట్రాక్ట్‌ను ఒకే సంస్థకు కట్టబెట్టేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఆంధ్రావాళ్లు దోచుకున్నారని.. ఇప్పుడు వారికే..

ఆంధ్రావాళ్లు దోచుకున్నారని.. ఇప్పుడు వారికే..

ఆంధ్రావాళ్లు దోచుకుంటున్నారని గతంలో ఆరోపించిన కేసీఆర్.. ఇప్పుడు అక్కడి కాంట్రాక్టర్లకే దోచిపెడుతున్నారని నాగం జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో జరుగుతున్నంత అవినీతి ఎక్కడా జరగడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై నాటి గవర్నర్ నరసింహన్‌కు రాస్తే ఆయన పట్టించుకోలేదని అన్నారు.

భారీ అవినీతికి తెరలేపారు..

భారీ అవినీతికి తెరలేపారు..

ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నాగం ప్రశ్నించారు. సెల్ఫ్ డిస్మిస్ అంటూ సుమారు 50 వేల మంది ఆర్టీసీ కార్మికులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. కేసీఆర్‌కు వారి ఉసురు తగులుతుందన్నారు. రాష్ట్ర ప్రజలను బిచ్చగాళ్లను చేసేలా కేసీఆర్ పాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాల పేరుతో భారీ అవినీతికి తెరలేపుతున్నారని నాగం ఆరోపించారు.

కేసీఆర్ సర్కారు మెడలు వంచేందుకు..

కేసీఆర్ సర్కారు మెడలు వంచేందుకు..

ఇది ఇలావుంటే, సీఎం కేసీఆర్‌పై భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆర్టీసీని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఉద్యమంలో మేధావులతో సహా అన్ని వర్గాల ప్రజలు కలిసిరావాలని, నిరంకుశ పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం మెడలు వంచాలన్నారు. ఆర్టీసీపై ప్రభుత్వ వైఖరిని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందన్నారు. కాగా, లక్ష్మణ్ సమయంలో ఆదివారం పలువురు నేతలు బీజేపీలో చేరారు.

16వ రోజుకు ఆర్టీసీ సమ్మె..

16వ రోజుకు ఆర్టీసీ సమ్మె..

తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు అక్టోబర్ 5 నుంచి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. నేటికి 16రోజులుగా కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయి. సమస్య పరిష్కరించేందుకు హైకోర్టు చర్చలు జరపాలంటూ అటు ప్రభుత్వానికి, ఇటు ఆర్టీసీ సంఘాలకు సూచనలు చేసింది. కార్మిక సంఘాలు చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. దీంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు.

English summary
Congress leader and Former Minister Nagam Janardhan Reddy hits out at CM KCR for TSRTC Strike issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X