ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు - ఉరిశిక్ష..!!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువ రించింది. సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం ఈ రోజు తీర్పు చెప్పింది. ఈ కేసులో ఏ 2 గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించింది. నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ రెండో అదనపు న్యాయ స్థానం విధించింది. 302, 120 ఐపీసీ, 109, 1989 సెక్షన్ ఐపీసీ ఇండియన్ ఇండియన్ ఆర్మ్ యాక్ట్ 1959 ప్రకారం శిక్ష విధించింది. శిక్ష తగ్గించాలని న్యాయమూర్తిని నేరస్థులు అభ్యర్ధించారు.
కోర్టు సంచలన తీర్పు
మిర్యాలగూడలో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ కేసులో ఏ2గా ఉన్న సుభాష్ శర్మకు న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు ఖరారు చేసింది. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగింది. ఈ కేసులో ఏ1గా ఉన్న అమృత తండ్రి అమృతరావు గతంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. మిర్యాలగూడకు చెందిన మారుతీరావు కూతురు అమృత, అదే ఊరికి చెందిన ప్రణయ్‌లు స్కూల్ ఏజ్ నుంచే ప్రేమించుకుని 2018లో పెళ్లి చేసుకున్నారు. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో 2018 సెప్టెంబరు 14వ తేదీన ప్రణయ్‌ను హత్య చేయించాడు.

పోలీసుల విచారణలో
ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో 8 మందిపై 302, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ల కింద మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి 2019 జూన్ 12న 1600 పేజీల్లో చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రణయ్ హత్య కేసులో 8 మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించారు. చార్జిషీట్ నివేదిక, పోస్టుమార్టం రిపోర్ట్, సైంటిఫిక్ ఎవిడెన్స్‌లతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించి ఈ రోజు తీర్పు వెల్లడించింది. ప్రణయ్ హత్య కేసులో A-1 మారుతీరావు, A-2 బిహార్‌కు చెందిన సుభాష్ శర్మ, A-3 అస్గర్ అలీ, A-4 అబ్దుల్లా బారి, A-5 ఎంఏ కరీం, A-6 శ్రవణ్ కుమార్, A-7 శివ, A-8 నిజాం గా పేర్కొన్నారు.
కోర్టు తీర్పుతో
కాగా, కేసులో నిందితుల పాత్రపై సాక్ష్యాధారాలను పరిగణించి శిక్ష ఖరారు చేస్తూ న్యాయస్థానం వెల్లడించింది. సుభాష్‌శర్మ (ఏ-2), అస్గర్‌అలీ(ఏ-3) విచారణ ఖైదీలుగా ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితులు బెయిల్‌పై విడుదలై కోర్టు విచారణకు హాజరవుతున్నారు. ఇప్పుడు ఈ కేసులో కోర్టు వెలువరించిన తీర్పు సంచలనంగా మారుతోంది.












Click it and Unblock the Notifications