Venkatesh: హీరో వెంకటేష్, రానా, సురేష్ బాబుకు షాకిచ్చిన కోర్టు..
హీరో వెంకటేష్, హీరో రానా, సురేష్ బాబుకు హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు షాకిచ్చింది. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్, దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి రానాపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది. ఫిల్మ్ నగర్ లోని డెక్కన్ కిచన్ కూల్చివేత కేసును విచారించిన కోర్టు.. కేసు నమోదు చేయాలని స్పష్టం చేసింది.
ఫామ్‌హౌస్ కేసు నిందితుడు నందకుమార్ సురేష్ బాబు, వెంకటేష్, రానా, అభిరామ్ పై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. డెక్కన్ కిచెన్ హోటల్‌ను కూల్చివేయడంపై ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్థల లీజ్ విషయంలో కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ దౌర్జన్యంగా హోటల్ ను కూల్చివేశారని నందకుమార్ ఆరోపించారు. వెంకటేశ్, సురేశ్ బాబు, రానా, అభిరామ్.. జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులతో కలిసిపోయి కూల్చివేశారని పేర్కొన్నారు.

60 మంది ప్రైవేటు బౌన్సర్లను పెట్టుకుని భవనాన్ని ధ్వసం చేశారన్నారు. డెక్కన్ కిచెన్ కూల్చేయడంతో రూ .20 కోట్లు నష్టపోయినట్లు వివరించారు. గతంలో డెక్కన్ హోటల్ కూల్చివేత కేసులో హైకోర్టు జీహెచ్‌ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా నందకుమార్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలను ధక్కరించి కూల్చివేశారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.
కోట్ల విలువైన బిల్డింగ్ కూల్చివేశారన్నారు. ఫర్నీచర్ ఎత్తుకెళ్లినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణ జరిపిన కోర్టు ముగ్గురి పై ఐపీసీ సెక్షన్ 448, 452,380, 506,120b కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కాగా కొద్ది రోజుల క్రితమే వెంకటేష్, సురేష్ బాబు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.












Click it and Unblock the Notifications