తమిళనాడు - శశికళ ఎఫెక్ట్: గవర్నర్ పైన నారాయణ తీవ్ర వ్యాఖ్యలు

గవర్నర్ వ్యవస్థ పైన సిపిఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి శశికళ బలనిరూపణకు గవర్నర్‌ అవకాశమివ్వాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌ వ్యవస్థ కేంద్రానికి ఊడిగం చేసేలా ఉందన

ఖమ్మం: గవర్నర్ వ్యవస్థ పైన సిపిఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి శశికళ బలనిరూపణకు గవర్నర్‌ అవకాశమివ్వాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌ వ్యవస్థ కేంద్రానికి ఊడిగం చేసేలా ఉందన్నారు.

గవర్నర్‌ వ్యవస్థ రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడటం లేదని, గవర్నర్‌ను కీలుబొమ్మను చేసి కేంద్రం ఆడుకుంటోందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని శక్తులు ఏకమౌతున్నాయన్నారు. తమిళనాడు గవర్నర్ విద్యాసాగర రావు కేంద్రం కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారన్నారు.

Narayana hot comments on Governor

శశికళకు ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వకపోవడం సరికాదన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు కేసీఆర్, చంద్రబాబుల పైన కూడా ఆయన వేర్వేరుగా మాట్లాడారు.

తెలంగాణలో కేసీఆర్‌ నియంతృత్వ పాలన కొనసాగుతోందని నారాయణ విమర్శించారు. కేసీఆర్‌ ఉద్యమ సమయంలో మిత్రులన్నవారిని, ఇప్పుడు శత్రువులు అంటున్నారన్నారు. అప్పటి శత్రువులే ఇప్పుడు కేసీఆర్‌కు మిత్రులయ్యారన్నారు.

2019 ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు గుండు కొట్టించడం ఖాయమన్నారు. కొడుకు నారా లోకేష్‌కు సీఎంను చేయాలని బాబు కలలు కంటున్నారని, లోకేష్ కనీసం ఎమ్మెల్యే కూడా కాలేడన్నారు. పేదల ఓట్లతో గెలిచిన చంద్రబాబు పెత్తందారులకు కొమ్ముకాస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+