హైదరాబాద్ టిఫిన్ సెంటర్లో కొత్త రూ. 500 నోటు: యజమాని సంబరం

మారేడుపల్లిలోని ఓ వ్యక్తి, తన సోదరుడు ఢిల్లీ నుంచి తెచ్చిన నోటుతో హోటల్‌కు వచ్చి టిఫిన్ చేశాడు. ఆ తర్వాత కొత్త రూ. 500 నోటును కౌంటర్ లో ఇస్తే.. అక్కడున్న అందరికీ ఆశ్చర్యం కలిగింది.

హైదరాబాద్: ప్రస్తుతం ఏటీఎంలలో లభిస్తున్న రూ. 2వేల కొత్త నోటుతో ప్రజలు చిల్లర కోసం ఎన్నో పాట్లు పడుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో రూ. 500 నోట్లే మొదట విడుదల చేస్తే బాగుండేదని ప్రజలు అభిప్రాయపడ్డారు.

దాదాపు అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే చేరుకున్న కొత్త రూ. 500 నోట్లు ఇప్పుడు హైదరాబాద్ నగరానికి కూడా చేరాయి. అయితే, హైదరాబాద్‌లో అన్ని బ్యాంకులకు ఇంకా కొత్త 500 రూపాయల నోట్లు రాలేదు. కాగా, ఓ హోటల్ యజమాని చేతికి మాత్రం ఈ నోట్ వచ్చింది.

Rs. 500 note received a breakfast centre owner in Hyderabad.

వివరాల్లోకి వెళితే.. మారేడుపల్లిలోని ఓ వ్యక్తి, తన సోదరుడు ఢిల్లీ నుంచి తెచ్చిన నోటుతో హోటల్‌కు వచ్చి టిఫిన్ చేశాడు. ఆ తర్వాత కొత్త రూ. 500 నోటును కౌంటర్ లో ఇస్తే.. అక్కడున్న అందరికీ ఆశ్చర్యం కలిగింది.

చాలా రోజుల తర్వాత 500 రూపాయలను చూస్తున్నానని హోటల్ యజమాని సంబరంగా చెప్పాడు. అక్కడున్న వారు సైతం ఆ నోటును ఆసక్తిగా చూశారు. కాగా, కొత్త 500 నోట్లు విరివిగా మార్కెట్లో అందుబాటులోకి వస్తే, చిల్లర కష్టాలు దాదాపు తీరిపోతాయని వారు అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+