వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చే ఏడాది కూడా రైతుబంధు : తెలంగాణ ప్రభుత్వం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం వచ్చే ఏడాది కూడా కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది. రైతుకు పంట పెట్టుబడి సాయం కోసం ఎకరానికి రూ.5 వేలు ఇస్తున్న సంగతి తెలిసందే. దీంతో ప్రభుత్వంపై ఆర్థికభారం పడుతున్న .. అన్నదాతల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఏడాదికి రెండుసార్లు పంట పెట్టుబడి అందిస్తోంది.

తెలంగాణ రైతులకు మరో గుడ్ న్యూస్. రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని వచ్చే ఏడాది కూడా కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది. 2020 ఆగస్టు 13 వరకు పథకం కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో 31.10 లక్షల రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నది. దీంతోపాటు ఒక్కో రైతుకు 3 వేల ప్రీమియంతో రూ.5 లక్షల బీమా కూడా అందిస్తున్న సంగతి తెలిసిందే.

next year also continue rythu bandhu

అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు నుంచి రైతు బంధు పథకాన్ని కేసీఆర్ సర్కార్ అమల్లోకి తీసుకొచ్చింది. ఎకరానికి రూ.4 వేల చొప్పున ఇస్తామని ప్రకటించారు. అలా చెప్పి అందజేశారు. కూడా తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.5 వేలు ఇస్తామని చెప్పి.. ఇస్తున్నారు. రైతులకు ప్రయోజనం కలిగించే ఈ పథకాన్ని మరో ఏడాది కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంట పెట్టుబడితో రైతులు ఎరువులు, విత్తనాలు ఎలాంటి రందీ లేకుండా కొనుగోలు చేయొచ్చని ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే.

English summary
The government has made it clear that the welfare of farmers will continue next year. It is known that the farmer is giving Rs 5000 per acre for crop support. The government is operating on the basis of the interests of the government. Crop investment is provided twice a year
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X