ముగ్గురు యువతుల అదృశ్యం, లేడీ డాక్టర్ని ప్రేమించి ముఖం చాటేసిన డాక్టర్
హైదరాబాద్: భాగ్యనగరంలో శుక్రవారం నాడు ఒకేరోజు ముగ్గురు విద్యార్థునులు అదృశ్యమయ్యారు. జవహర్ నగర్‌కు చెందిన శ్రీనిఖిత కాలేజీకి వెళ్లింది. ఆమె తన అత్త కూతురు రితికను కూడా తన వెంట తీసుకు వెళ్లింది. వారు హాల్ టిక్కెట్ కోసం వెళ్లారు. కానీ ఆ తర్వాత అదృశ్యమయ్యారు.
బోరబండ వినాయక నగర్‌కు చెందిన ఎలీషా అనే యువతి పరీక్ష రాసేందుకు చార్మినార్ కళాశాలకు వెళ్లింది. ఆమె కూడా కనిపించడం లేదు. సాయంత్రం అయినా ఎలీషా రాకపోవడంతో తల్లిదండ్రులు ఆమె స్నేహితురాలు శ్రీదేవికి ఫోన్ చేశారు. ఎలీష అసలు పరీక్షనే రాయలేదని చెప్పారు. ఎలీష పరీక్ష రాసేందుకు బస్సులో వెళ్లినట్లుగా తెలుస్తోంది.

డాక్టర్ పైన నిర్భయ కేసు
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వైద్యుడు రాకేష్ పైన కర్నూలు జిల్లాలో నిర్భయ కేసు నమోదయింది. రాకేష్, మరో లేడీ డాక్టర్ కర్నూలు జిల్లా మెడికల్ కాలేజీలో ప్రేమించుకున్నారు. ప్రేమించిన రాకేష్ ముఖం చాటేశాడని లేడీ డాక్టర్ ఫిర్యాదు చేసింది. దీంతో కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. రాకేష్ పైన, కుటుంబ సభ్యుల పైన కేసు నమోదయింది.
ఎంపీపీ కార్యాలయంపై పోలీసుల దాడి
ఘట్‌కేసర్ ఎంపీపీ కార్యాలయంపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఎంపీపీ సోదరుడు సహా 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 20 వేలు, 5 బైక్‌లు, 12 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications