నవ్వలేక.. కోప్పడలేక.. కేటీఆర్ మౌనంగా ఉండిపోయిన క్షణం
నచ్చిన వ్యక్తులు గానీ.. నచ్చిన వస్తువులు గానీ.. మనం వెళ్లే తోవలో ఎదురైనప్పుడు ఆగి పలకరించడమో, లేదా ఆ వస్తువుల గురించి ఆరా తీయడమో సర్వ సాధారణంగా జరిగే వ్యవహారమే. సామాన్యులైనా, కేబినెట్ మంత్రులైనా దీనికి అతీతులేం కాదు. తాజాగా తెలంగాణ మంత్రి ఒకరు ఇదే వ్యవహారంతో వార్తల్లోకి ఎక్కారు.
ఇంతకీ జరిగిన విషయమేంటంటే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే గంపగోవర్థన్ ఇంట్లో జరిగిన వివాహానికి హాజరవడం కోసం బయలుదేరిన మంత్రి గారికి.. హైదరాబాద్ శివారులోని కొంపల్లి వద్దకు చేరుకోగానే రోడ్డు పక్కనే అమ్ముతున్న తాటిముంజలను చూసి వాటి మీదకు మనసు గుంజింది. అంతే.. కాన్వాయ్ ని రోడ్డుపైనే ఆపేసి తాటిముంజలు అమ్ముతున్న వ్యక్తి దగ్గరికెళ్లి స్వయంగా బేరమాడి కొనుక్కొచ్చుకున్నారు.

అయితే మంత్రి గారి కాన్వాయ్ ను రోడ్డుపైనే నిలిపేయడంతో.. వెనకాల భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ ట్రాఫిక్ జామ్ లో అదే పెళ్లికి హాజరవడం కోసం వెళ్తున్న మంత్రి కేటీఆర్ కూడా ఉండడం గమనార్హం. దీంతో విషయంపై ఆరా తీసిన కేటీఆర్ అసలు విషయం తెలుసుకొని అటు నవ్వలేక.. ఇటు కోప్పడలేక.. మౌనంగా ఉండిపోయారట. దీనంతటికి కారణమైన సదరు మంత్రి గారి పేరు మాత్రం బయటపడలేదు.












Click it and Unblock the Notifications