ఇంటర్ వివాదంపై ఎట్టకేలకు స్పందించిన సీఎం.. ఫెయిల్ అయిన విద్యార్థులకు ఫ్రీ రీవాల్యుయేషన్ !

ఇంటర్ ఫలితాల ఆందోళనపై ఎట్టకేలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. గత మూడు రోజులుగా విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన తర్వాత నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కాగా ఈనెల విడుదల చేసిన ఇంటర్ పరీక్షల ఫలితాలపై అనేక వివాదాలునెలకొన్న సంగతి తెలిసిందే , ఈనేపథ్యంలోనే 16 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారంటూ హైకోర్టులో సైతం కేసు ఫైల్ అయింది. కాగా కోర్టు సైతం దీనిపై సిరియస్ అయింది. ఈనేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఇంటర్ ఫెయిల్ విద్యార్థులకు ఊరట,

ఇంటర్ ఫెయిల్ విద్యార్థులకు ఊరట,

ఆందోళన చెందుతున్న ఇంటర్ విద్యార్థులపై ఎట్టకేలకు స్పందించిన సీఎం కేసిఆర్ విద్యార్థులకు శుభవార్త అందించారు. ఇంటర్ బోర్డు తప్పిదాలకు ఫీజుల రూపంలో బలి అవుతున్న విద్యార్థులకు ఊరట కల్గించారు. ఈనేపథ్యంలోనే ఇంటర్ లో ఫెలయిన విద్యార్థులకు ఉచిత రీవ్యాల్యుయెషన్, రీకౌంటింగ్, లకు సంబంధించి ఫీజులు లేకుండా చేయాలని ఆదేశించారు. అయితే పాస్ అయిన విద్యార్థులకు మాత్రం రీవ్యాల్యుయెషన్ ను ఫీజులు యధావిధిగా ఉంటాయని చెప్పారు. ఇక ప్రక్రియనంతా బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ కాకుండా విద్యాశాఖ కమీషనర్ కు అప్పగించారు.త్వరగా రీవ్యాల్యుయెషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి అడ్వాన్స్‌సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కాగా ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంభాలకు తన సానుభూతిని వ్యక్తం చేశారు. సమావేశంలో కాగా ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఆ శాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి, తోపాటు బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ లు పాల్గోన్నారు. అంతకుముందే పలితాల తీరుపై ఆయన సీరియస్ అయినట్టు తెలుస్తోంది.

భవిష్యత్ లో ఎలాంటీ సమస్యలు రాకుండా ఇతర రాష్ట్ర్రాల పద్దతి అధ్యయనం

భవిష్యత్ లో ఎలాంటీ సమస్యలు రాకుండా ఇతర రాష్ట్ర్రాల పద్దతి అధ్యయనం

ఇంటర్మీడియట్ తోపాటు, ఎంసెట్ తదితర ప్రవేశార్హతల విషయంలో కూడా ప్రతి సంవత్సరం ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రభుత్వం విద్యార్థులు ,తల్లిదండ్రులు వల్ల అనవసరంగా తలనొప్పులు భరించాల్సి వస్తుందని ,ఈ పరిస్థితిని నివారించాలని ,పరీక్షల నిర్వహాణను స్వతంత్ర సంప్థకు అప్పగించే అవకాశాలను కూడ పరీశీలించాలని ,ఈనేపథ్యంలోనే ఇతర దేశాల్లోగాని, రాష్ట్ట్రాల్లో ఉన్న పద్దతులను అధ్యయనం చేయాలని ఆదేశించారు.కాగా ఎన్నో రుగ్మతలను అధిగమించిన పరిస్థితుల్లో విద్యాసంస్థల్లో వస్తున్న సమస్యలను నివారించడం పెద్ద కష్టమేమి కాదని అన్నారు.

మృతి చెందిన విద్యార్థులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన సీఎం

మృతి చెందిన విద్యార్థులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన సీఎం

ఇంటర్ మిడియట్ లో ఫెయిల్ అయ్యామనే బాధతో కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం అంత్యంత భాధకరమని అన్నారు. ఇలాంటీ వార్తలను వినడం దురదృష్టకరం అన్నారు. ఇంటర్ మీడియట్ ఒక్కటే పరిష్కారం కాదని ,పరీక్షల్లో ఫెలయితే చదువులో ,జీవితంలో ఫెలయినట్టు కాదని ,ప్రాణం ముఖ్యమైనదని సూచించారు. సామర్థ్యాన్ని బట్టి, ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలని అన్నారు.ఆత్మహత్యలు తల్లిదండ్రులకు తీరని శ్లోకం మిగులుస్తోందని అన్నారు. విద్యార్థులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+